వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణ దక్కేనా: కాంగ్రెస్‌లో ఐటి దిగ్గజం నీలేకని(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని ఆదివారం లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నందన్ నీలేకని దేశ ప్రజలకు ఆధార్ కార్డులు జారీ చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నందన్ నీలేకనిని బెంగళూరు లోకసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరుసటి రోజే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆరంభంలోనే విషమ పరీక్షకు సిద్ధమయ్యారు.

కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు జి పరమేశ్వర ఆదివారం బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డప్పు వాయిద్యాల హోరు నడుమ నీలేకనిని తమ పార్టీలోకి స్వాగతించారు.

నందన్ నీలేకని

నందన్ నీలేకని


కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు జి పరమేశ్వర ఆదివారం బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డప్పు వాయిద్యాల హోరు నడుమ నీలేకనిని తమ పార్టీలోకి స్వాగతించారు.

నీలేకని

నీలేకని

సభ్యత పత్రాన్ని పూర్తిచేయడానికి ముందు నీలేకనికి కాంగ్రెస్ పతాకాన్ని అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నీలేకని (58) మాట్లాడుతూ, ఢిల్లీలో బెంగళూరుకు బలమైన నాయకుడి అవసరం ఎంతో ఉందన్నారు.

నందన్

నందన్

ఈ లోటును తీర్చేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని అన్నారు. ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితరులతో కలసి 1981లో కేవలం 250 అమెరికా డాలర్ల పెట్టుబడితో ఇన్ఫోసిస్‌ను ఏర్పాటు చేసిన నీలేకని ఆ సంస్థను భారత ఐటి దిగ్గజంగా తీర్చిదిద్దారు.

కాంగ్రెసులోకి

కాంగ్రెసులోకి

నీలేకని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి యోధుడు అనంత్ కుమార్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. దక్షిణ బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఐదుసార్లు తిరుగులేని విజయాలు సాధించిన అనంత్ కుమార్ మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

బెంగళూరు

బెంగళూరు

ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని ఆదివారం లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నందన్ నీలేకని దేశ ప్రజలకు ఆధార్ కార్డులు జారీ చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 కర్నాటక

కర్నాటక

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నందన్ నీలేకనిని బెంగళూరు లోకసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరుసటి రోజే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆరంభంలోనే విషమ పరీక్షకు సిద్ధమయ్యారు.

English summary
Congress' high-profile candidate Nandan Nilekani, contesting from the prestigious Bangalore South parliamentary constituency, on Sunday said it was time for his rival - BJP's Ananth Kumar - to go.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X