• search

టెక్కీలకు శుభవార్త: ఐటీ రంగంలో వృద్ది

By Narsimha
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం వృద్ది చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీలో టాప్ కంపెనీల కంటే మధ్య స్థాయి కంపెనీలు వేగంగా వృద్దిని సాధిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

  ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పులు ఐటీ రంగంపై తీవ్రంగా కన్పిస్తున్నాయి. అయితే సాఫ్ట్‌వేర్ రంగం మందగమనంలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  మరో వైపు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు ప్రత్యేకించి ఇండియాకు చెందిన టెక్ కంపెనీలపై తీవ్రంగా పడ్డాయి. ఈ కారణంగానే ఇండియాకు చెందిన టెక్ కంపెనీలు అమెరికాలో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

  టాప్ కంపెనీల కంటే లాభాల్లో

  టాప్ కంపెనీల కంటే లాభాల్లో


  టాప్‌ కంపెనీలకు మించి ఆదాయం, లాభాల్లో బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి.డార్క్‌ హార్స్‌లుగా ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్, హెక్సావేర్‌ టెక్నాలజీస్, మైండ్‌ట్రీ కంపెనీలు భవిష్యత్‌లో మరిన్నిమంచి ఫలితాలను పొందే అవకాశం లేకపోలేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.టాప్‌ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ గత కొన్ని త్రైమాసికాలుగా ఆదాయం, లాభాల్లో ఒకే అంకె వృద్ధికి పరిమితమయ్యాయి.

  హెక్సావేర్ టెక్నాలజీస్ వృద్ది

  హెక్సావేర్ టెక్నాలజీస్ వృద్ది

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల కాలంలో హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ బలమైన వృద్ధిని నమోదు చేసింది. 2017 సంవత్సరానికి డాలర్‌ ఆదాయం వృద్ధి అంచనాలను 14- 15%కి పెంచడం విశేషం. అంతక్రితం ఈ అంచనాలు 10-12 శాతమే. ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ మిడ్‌సైజు కంపెనీల్లో 1.1 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అతిపెద్ద కంపెనీగా ఉంది. సెప్టెంబర్‌ క్వార్టర్లో స్థిరమైన వృద్ధిని ప్రదర్శించింది.

  ఐటీ వృద్ది శాతం 8 శాతంలోపుగానే

  ఐటీ వృద్ది శాతం 8 శాతంలోపుగానే

  ఈ ఏడాది ఐటీ ఎగుమతులు 7-8 శాతంగా ఉండొచ్చని నాస్కామ్ అంచనా వేసింది.ప్రకటించింది. దీంతో ఐటీ రంగం మరో ఏడాది కూడా ఒకే అంకె వృద్ధికి పరిమితం కానుంది.ఇన్ఫోసిస్‌ విషయం మాత్రం భిన్నం. 2017-18 ఆర్థిక సంవత్సరానికి తన వృద్ధి అంచనాలను ఏకంగా 2 శాతం తగ్గించింది. విప్రో సైతం త్రైమాసిక వారీ అంచనాల పట్ల అప్రమత్తత వ్యక్తం చేసింది

   డిజిటల్ సేవల్లో ఇలా..

  డిజిటల్ సేవల్లో ఇలా..

  స్వతహాగా వచ్చే సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల కాంట్రాక్టులు తగ్గిపోయే ప్రభావం పెద్ద, మధ్య స్థాయి కంపెనీలపై మిశ్రమంగా ఉంది.ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ వంటి సంప్రదాయ సేవల ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోతుంది.రోవైపు డిజటల్‌ టెక్నాలజీ సేవలు ఇంకా సంప్రదాయ సేవల వాటా స్థాయికి చేరకపోవడం కంపెనీల వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తోందంటున్నారు విశ్లేషకులు.

   ఆటోమేషన్‌తో కొత్త అవకాశాలు

  ఆటోమేషన్‌తో కొత్త అవకాశాలు

  హెక్సావేర్‌ ఆటోమేషన్‌ను ఉపయోగిస్తూ కొత్త కాంట్రాక్టులను సంపాదిస్తోంది. అదే సమయంలో ఈ రంగంలోని ఇతర మధ్య స్థాయి కంపెనీలైన మైండ్‌ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్‌ మాత్రం సంప్రదాయ విభాగాలపైనే ఇప్పటికీ ఆధారపడి కొనసాగుతున్నాయి. దీంతో పరిశ్రమలో ఉన్న వృద్ధి మందగమన ప్రభావం వాటి ఫలితాల్లో కనిపిస్తోందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  IT spending in India is expected to grow over 9% to $87.1billion in 2018, a slower pace of growth than in 2017, research firm Gartner said on Tuesday. IT spending this year is expected to end at $79.8 billion, up 14.2% from 2016. Next year will see slower growth on all the segments the research firm tracks – communication services,

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more