వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేన అభ్యర్థే సీఎం అవుతారు.. సంజయ్ నోట ఉద్దవ్ మాట... ఢిల్లీకి రౌత్...

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో శివసేన అభ్యర్థి సీఎం పదవీ అదిష్టిస్తారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తనకు శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే చెప్పినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య పొత్తు పొడవలేదు. దీంతో సాయంత్రం తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని బీజేపీ నేతలు గవర్నర్‌కు తెలియజేశారు. ఆ వెంటనే సంజయ్ రౌత్ ప్రతిస్పందించారు. మరోవైపు ఎన్సీపీ షరతులు విధించడంతో హుటహుటిన ఢిల్లీకి సంజయ్ రౌత్ వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు సోమవారం సాయంత్రం 7.30 గంటల వరకే అవకాశం ఉన్నందున పవార్‌తో చర్చలు జరిపేందుకు వెళ్లారు.

ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ ప్రయత్నించలేదని.. సీఎం పదవీ కోసం ఎలా ఆశపడుతుందని విమర్శించారు. వారు సంకీర్ణ ధర్మాన్ని మరచిపోయారని మండిపడ్డారు. అధికారం చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని.. రెండున్నరేళ్ల సీఎం పదవీపై మాట కూడా దాటవేశారని విమర్శించారు. దీంతోనే పరిస్థితిని అంచనావేసి శివసేన అభ్యర్థి సీఎం అవుతారని ఉద్దవ్ తెలిపారని చెప్పారు.

It will be a Sena chief minister if Udhhav says so: Sanjay Raut

సార్వత్రిక ఎన్నికల్లో 'మహాయుతి' పేరుతో బీజేపీ తాము పోటీచేశామని చెప్పారు. తమకే మెజార్టీ సీట్లు కట్టబెట్టినా.. బీజేపీ స్వరం మారిందని విమర్శించారు. 50-50 ఫార్ములా మధ్యే ఇరుపార్టీలా మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. అందుకు అంగీకరించారని ఉద్దవ్ అంటే.. అదేం లేదని ఫడ్నవీస్ కొట్టిపారేశారు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య కలహాలు వీడిపోయేందుకు దారితీసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పినా తర్వాత శివసేనను గవర్నర్ ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ కాంగ్రెస్-ఎన్సీపీతో చర్చలు జరుపుతుంది.

English summary
SShiv Sena leader Sanjay Raut asserted on Sunday that if his leader Uddhav Thackeray has said someone from his party will become the chief minister in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X