• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎవరు అందగత్తెలు?: కేర‌ళ అమ్మాయిలా? త‌మిళ అమ్మాయిలా?

By Ramesh Babu
|

చెన్నై: కేర‌ళ అమ్మాయిలు బాగుంటారా? త‌మిళ అమ్మాయిలు బాగుంటారా? ఛ.. ఇదే ప్రశ్న అనుకుంటున్నారా? ఈ ప్రశ్న మేం అడగడం లేదండీ బాబూ.. ఓ తమిళ ఛానల్ అడుగుతోంది.. కావాలంటే మీరే చూడండి.

త‌మిళ‌నాడులోని స్టార్‌ విజ‌య్ ఛాన‌ల్‌లో నీయా.. నానా (నువ్వా.. నేనా) అనే కార్య‌క్ర‌మం ప్ర‌సారమ‌వుతోంది. ఇందులో ఏదో ఒక అంశం మీద రెండు వ‌ర్గాలు చ‌ర్చించుకుంటాయి.

kerala-girls-tamil-girls

ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడే వారి అభిప్రాయాలు చాలాసార్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. అయితే ఈ వారం ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌సారం కానున్న అంశ‌మే పెద్ద టాపిగ్గా మారింది.

ఇంతకీ, ఆ అంశం ఏంటంటే.... కేర‌ళ అమ్మాయిలు బాగుంటారా? త‌మిళ అమ్మాయిలు బాగుంటారా? దీనికి సంబంధించిన ప్రోమోను కూడా టీవీ ఛాన‌ల్ విడుద‌ల చేసింది. పిల్ల‌ల్ని బుజ్జ‌గించ‌డంలో తేడా, వేష‌ధార‌ణ‌, డ్యాన్సింగ్ స్టైల్ ఇలా కొన్ని అంశాల మీద ఇరు వ‌ర్గాల అమ్మాయిలు వాద‌న‌లు విసురుకోవ‌డం ప్రోమోలో చూడొచ్చు.

జిమ్మిక్కీ క‌మ్మాల్‌ పాట‌కు డ్యాన్స్ వేసి ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్‌గా మారిన మ‌ల‌యాళ కుట్టి షెరిల్‌కి త‌మిళ‌నాడు యువ‌త అభిమానులుగా మారారు. దీంతో అక్క‌డి యువ‌త త‌మిళ అమ్మాయిల కంటే కేర‌ళ అమ్మాయిలే బాగుంటార‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు.

దీని గురించి తేల్చ‌డానికి ఈ కార్య‌క్ర‌మ నిర్వా‌హ‌కులు ఈ అంశాన్ని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు ప్ర‌సారం కానున్న ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి స్టార్ విజ‌య్ ఛాన‌ల్ సోష‌ల్ మీడియాలో పోలింగ్ కూడా ఆవిష్క‌రించింది. ఇప్ప‌టికే ఈ పోల్‌కి 1000 మందికి పైగా ఓటింగ్ చేశారు.

అయితే ఇలాంటి సున్నితమైన అంశాన్ని తీసుకోవ‌డంపై కొంత‌మంది నిపుణులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. స‌మాజంలో ఉన్న భేదాలు స‌రిపోక‌, ఇలా కొత్త భేదం సృష్టించ‌డం స‌బ‌బు కాద‌ని మంద‌లిస్తున్నారు.

మ‌రి కొంత‌మంది మాత్రం ఇదే టాపిక్‌ని మ‌గ‌వాళ్ల విష‌యంలో కూడా పెట్టాల‌ని సూచిస్తున్నారు. ఈ వివాదాస్పద అంశానికి చివ‌రికి ఎలాంటి స‌మాధానం దొరుకుతుందో తెలుసుకోవ‌డానికి అటు కేరళ, ఇటు తమిళనాడు ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Neeya Naana, anchored by popular VJ Gopinath, has been Star Vijay's flagship programme. One of the earliest television debate shows, the programme was popular for its take on contemporary social issues. However, of late, the channel has been trying to include some not-so serious topics too in the debate. While people have been divided over their preference for the show's content, the channel has decided to up their game this week, by deciding to take up a topic, 'Who is beautiful? Kerala girls or Tamil girls'. The channel's announcement regarding the topic has gone viral on the social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more