వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల్లో ఒంటరి పోరు... కూటమితో తెగదెంపులు తాత్కాలికమేనన్న బెహన్ జీ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఉప ఎన్నికల్లో మాయావతి ఒంటరి పోరు...!! || Oneindia Telugu

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టంచేశారు. 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న బై పోల్‌లో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో బెహన్ జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమిలో ఉంటే గెలుస్తామని అనుకోవద్దని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

పత‌నం అంచుల్లో స‌ర్కార్: సీనియ‌ర్ల అస‌మ్మ‌తి గ‌ళం: ఒక‌రి రాజీనామా!పత‌నం అంచుల్లో స‌ర్కార్: సీనియ‌ర్ల అస‌మ్మ‌తి గ‌ళం: ఒక‌రి రాజీనామా!

కూటమికి బ్రేక్

కూటమికి బ్రేక్

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డుకునేందుకు ఏర్పడిన మహాఘట్‌బంధన్‌పై మాయా క్లారిటీ ఇచ్చారు. మహాకూటమితో బంధాన్ని తాత్కాలికంగా తెంచుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్ భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని విజయాలుసాధిస్తే ఆయనతో కలిసి పనిచేస్తామని మాయా చెప్పారు. ఒకవేళ ఆయన విజయం సాధించలేకపోతే ఒంటిరిగానే ముందుకెళ్తామని తేల్చి చెప్పారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో మాత్రం ఒంటిరిగానే బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు బెహన్‌జీ ప్రకటించారు.

కొనసాగనున్న స్నేహబంధం

కొనసాగనున్న స్నేహబంధం

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ య యాదవ్ తనకు ఎంతో గౌరవమిచ్చారని అన్నారు మాయావతి, దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ మధ్య ఉన్న విబేధాల్ని పక్కనబెట్టామని చెప్పారు. తమ బంధం రాజకీయాల కోసం కాదని, ఈ స్నేహబంధం ఎప్పటికీ కొనసాగుతుందని మాయావతి స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యాదవ సామాజికవర్గం సమాజ్‌వాదీ పార్టీకి మద్దతివ్వలేదని, అందుకే బలమైన నాయకులు కూడా ఓటమి పాలయ్యారని బెహన్ జీ అభిప్రాయపడ్డారు.

సామాజిక న్యాయం కోసం పోరాటం

సామాజిక న్యాయం కోసం పోరాటం

కూటమి విఫలమైనప్పటికీ సామాజిక న్యాయం కోసం కలిసి పోరాటం చేస్తామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు జరిగిన తీరు వేరుగా ఉందని, అది తనకు కూడా అర్థం కాలేదని అన్నారు. టీవీలు, సెల్‌ఫోన్లు ద్వారా ప్రజలతో బీజేపీ మైండ్ గేమ్ ఆడిందని అఖిలేష్ ఆరోపించారు. ఈ యుద్ధతంత్రం అర్థమైన రోజున తాము విజేతలుగా నిలుస్తామని చెప్పారు.

English summary
Mayawati today made it official that BSP will contest bypolls to 11 Uttar Pradesh assembly seats alone after her alliance with Akhilesh Yadav flopped in the national election. We can't ignore political realities, the former Chief Minister said, confirming that she said she was taking a break from her partnership with the Samajwadi Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X