వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200 కి.మీ తొక్కిన బాలిక జ్యోతి సాహసానికి ఇవాంకా ట్రంప్ ఫిదా

|
Google Oneindia TeluguNews

కంటే కూతుర్నే కనాలి . ఆ కూతుర్ని కొడుకల్లే పెంచాలి . కొడుకు , కూతురు ఎవరైనా ఆ తల్లిదండ్రులకు సమానమనే భావన ఉండాలి . ఇక నేటి సమాజంలో బాలికా వివక్ష కొనసాగుతున్నా ఆ వివక్షను అధిగమించి గాయపడిన తండ్రిని సైకిల్ పై ఎక్కించుకుని మొక్కవోని ధైర్యంతో 1200కిలోమీటర్లు ప్రయాణం చేసి గమ్య స్థానానికి చేరుకుంది ఒక 15ఏళ్ళ బాలిక. పదిహేనేళ్ళ బాలిక జ్యోతి సాహసానికి అందరూ సలాం చేస్తే ఇవాంకా సైతం ప్రశంసలు కురిపించింది .

Recommended Video

Ivanka Trump Praises Bihar Girl Who Cycled 1,200 km With father

కంటే కూతుర్నే కనాలి .. తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200కి.మీ తొక్కిన బాలిక సాహసానికి సలాం అనాలికంటే కూతుర్నే కనాలి .. తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200కి.మీ తొక్కిన బాలిక సాహసానికి సలాం అనాలి

బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి తన పదిహేను ఏళ్ల కుమార్తె జ్యోతితో కలిసి కరోనా లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ నుండి ఉపాధి కోల్పోయి సొంతూరికి పయనమయ్యారు. గాయపడిన తండ్రిని తీసుకుని రవాణా సాధనాలు ఏమీ లేని పరిస్థితిలో ఒక సైకిల్ పై 15 ఏళ్ళ జ్యోతి సాగించిన ప్రయాణం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. వారం రోజుల పాటు 1200కిలోమీటర్లు అలుపెరుగని ప్రయాణం సాగించింది . తండ్రిపై త‌న ప్రేమ ఏపాటిదో ఆమె సాగించిన సాహసోపేత ప్రయాణంతో నిరూపించుకుంది. ఆ బాలిక యొక్క ప‌ట్టుద‌ల‌కు ,తండ్రిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళాలి అన్న తపనకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్ర‌శంసలు కురిపించింది .

Ivanka trump praised beautiful feat of a girls adventure on a 1200km bicycle with her father

ఇక ఇదే సమయంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం జ్యోతిని ప్రశంసించారు. దర్భాంగ కు చెందిన జ్యోతి అస‌మాన‌ ప్రతిభను మెచ్చుకున్నారు. గాయంతో ఉన్న తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని 7 రోజుల పాటు తొక్కుతూ 1200 కిలోమీట‌ర్ల‌ దూరం ప్రయాణించి సొంత ఊరికి చేరుకుంది. ఆమె అందమైన స‌హ‌నం, ప్రేమ, భారతీయ సొసైటీనే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్‌ను కూడా ఆకట్టుకుంది. అంటూ ఇవాంకా ట్రంప్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఇవాంకా ట్వీట్ తో ఆ బాలిక సాహసం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది .

English summary
Fifteen-year-old Jyoti carried her injured father from Delhi to Darbhanga, Bihar almost 1,200 kilometres on a bicycle. Ivanka trump praised beautiful feat of a girl's adventure on a 1200km bicycle with her father
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X