వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్వేత వర్ణ షెర్వానీలో మెరిసిన ఇవాంక ట్రంప్: ముర్షిదాబాద్ పట్టుతో డిజైన్, కెమెరా కళ్లన్నీ ఆమె వైపే..?

|
Google Oneindia TeluguNews

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ రెండోరోజు మెరిసారు. ట్రంప్ పర్యటనలో భాగంగా సోమవారం ఎర్రని డ్రెస్సు వేసుకొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు ఇవాంక ట్రంప్.. శ్వేత వర్ణ డ్రెస్సు వేసుకొని.. ఆ వస్త్రానికే అందం తీసుకొచ్చారు.

 శ్వేతవర్ణం షెర్వానీ..

శ్వేతవర్ణం షెర్వానీ..

ఉదయం రాష్ట్రపతి భవన్ వద్దకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ వెనకాల తన భర్త జరెద్ కుష్నర్‌తో కలిసి ఇవాంక వచ్చారు. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా తెల్లని షెర్వాణీ ధరించారు. దీంతో ఆమెను మరోసారి ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.

 ముర్షిదాబాద్ పట్టు..

ముర్షిదాబాద్ పట్టు..

ఇండో వెస్ట్రన్ డిజైనర్ అనితా డొంగ్రే షెర్వానీని డిజైన్ చేశారు. ముర్షిదాబాద్ పట్టుతో తయారుచేసిన షెర్వానీని అందంగ డిజైన్ చేశారు. స్లివ్‌లెస్ కాకుండా నిండుగా.. భారతీయత ఉట్టిపడేట్టు అందులో ఇవాంక కనిపించారు. షెర్వానీని మెటాలిక్ బటన్లను పొందుపరిచారు. షెర్వానీ కింద కూడా స్ట్రెయిట్ ఫీట్ గల తెల్లని ప్యాంట్‌ను ఇవాంక ధరించారు. షెర్వానీ ధరించిన ఇవాకం వెంట్రుకలను వీరబోసుకొని కనిపించారు.

బెంగాల్ పట్టు

బెంగాల్ పట్టు

పశ్చిమబెంగాల్‌కి చెందిన ముర్షిదాబాద్ పట్టును వినియోగించానని అనితా డోంగ్రె తెలిపారు. ఈ పట్టును పురాతన కాలం మాదిరిగా చేతితో నేశారని తెలిపారు. వాస్తవానికి ఇలాంటి షేర్వానినీ ఇరవై ఏళ్ల క్రితమే తాము రూపొందించామని చెప్పారు. కానీ ఏళ్లు గడుస్తోన్నా ఇలాంటి షేర్వాని ఇప్పటికీ కూడా చూడచక్కగా ఉందని పేర్కొన్నారు. తనకు శ్వేత వర్ణంతోపాటు నలుపు, బ్లూ కలర్ అంటే ఇష్టమని పేర్కొన్నారు.

శక్తిమంతమైన మహిళలకు..

శక్తిమంతమైన మహిళలకు..

ప్రపంచంలో శక్తిమంతమైన మహిళలను అనిత డోంగ్రే వస్త్రాలను డిజైన్ చేస్తుంటారు. ఇదివరకు కేట్ మిడిల్‌టన్‌కు కూడా చేశారు. 2016లో ఆమె వచ్చిన సమయంలో డిజైన్ చేశారు. బెల్జియానికి చెందిన రాణి మథిదే, ట్రుడేకి చెందిన సోపి గ్రెగోయిర్ వస్త్రాలను కూడా డిజైన్ చేశారు. 2018లో భారత్ వచ్చిన సమయంలో హిల్లరీ క్లింటన్ వస్త్రాలను కూడా అనిత డిజైన్ చేశారు. ప్రపంచంలోని శక్తిమంతమైన మహిళలకు అనిత డిజైన్ చేస్తుంటారు. ఆ వరసలో ఇవాంక ముందుగానే తన పేరును నమోదు చేయించుకున్నారు.

English summary
Ivanka Trump walked in footsteps of the First Lady Melania Trump on February 25 as she made a stunning appearance at the Rashtrapati Bhavan in Delhi in a pristine white ensemble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X