వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు భారతరత్న ఇవ్వకూడదు: ఎన్ని కేసులు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వకూడదని పీఎంకే యూత్ విభాగం నాయకుడు అన్బుమణి రాందాస్ డిమాండ్ చేస్తున్నారు. జయలలితకు భారతరత్న ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

<strong>మోడీ మైండ్ గేమ్: బీజేపీ చేతిలో పన్నీర్ జుట్టు, గిరిజ ఎవరో తెలుసా ?</strong>మోడీ మైండ్ గేమ్: బీజేపీ చేతిలో పన్నీర్ జుట్టు, గిరిజ ఎవరో తెలుసా ?

ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రాందాస్ ఈ విధంగా చెప్పారు. ఎలాంటి మచ్చలేని సమగ్ర వ్యక్తిత్వం, భారతదేశ అభివృద్దికి నిస్వార్థంగా కృషి చేసిన వారికి అత్యున్నత పురస్కారం (భారతరత్న) ఇవ్వాలని అన్నారు.

J Jayalalithaa doesn’t deserve Bharat Ratna: MP Ramadoss

అయితే భారతరత్న పురస్కారం పొందే అర్హత దివంగత జయలలితకు లేదని, ఆమె మీద 15 అవినీతి కేసులు నమోదు అయ్యాయని, ఆ కేసుల విచారణ ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆమెను నిర్దోషిగా కర్ణాటక హైకోర్టు వదిలేసిన కేసు అప్పీల్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని రాందాస్ గుర్తు చేశారు.

<strong>శశికళకు చాలెంజ్: ఇక్కడ గెలిచి, అక్కడ పోటీ చెయ్యి !</strong>శశికళకు చాలెంజ్: ఇక్కడ గెలిచి, అక్కడ పోటీ చెయ్యి !

అన్నాడీఎంకేలో అంతా తానై సుప్రీంగా వ్యవహరించిన జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిందని రాందాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు తమిళనాడులో అధికారంలో ఉండటానికి అన్నాడీఎంకే నాయకులు పార్టీ భాద్యతలు శశికళకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, శశికళకు ప్రజల మద్దతు మాత్రం లేదని అన్బుమణి రాందాస్ వివరించారు.

English summary
PMK youth wing leader Anbumani Ramadoss has strongly opposed the Tamil Nadu Government’s demand to posthumously confer the nation’s highest civilian award, the Bharat Ratna, to former Chief Minister and AIADMK leader Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X