వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో షరతుల వేడి: పిడిపి వర్సెస్ బిజెపి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లో రాజకీయం వేడెక్కింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలు పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీతో విడివిడిగా సమావేశం కావడం చర్చకు దారి తీసింది. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతికి సంతాపం తెలిపేందుకు వీరు ముఫ్తీని మహబూబాను కలిశారని చెబుతున్నా.. ఏదో రాజకీయం జరుగుతోందంటున్నారు.

గత శుక్రవారం నుంచి జమ్ము కాశ్మీర్ రాష్ట్రం గవర్నర్ పాలన కిందకు వెళ్లింది. తండ్రి మరణం తర్వాత ప్రకటించిన నాలుగు రోజుల సంతాప దినాలు ముగిసేవరకూ తాను ప్రమాణ స్వీకారం చేయబోనని మహబూబా ముఫ్తీ చెప్పారు. దీంతో, ఈ వారం బాధ్యతలు చేపట్టవచ్చు.

కాశ్మీర్‌లో 2002 నుంచి 2008 మధ్య పీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం గత ఎన్నికల అనంతరం బీజేపీ, పీడీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మహబూబా.. బిజెపి ముందు కొన్ని షరతులు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

 పిడిపి - బిజెపి

పిడిపి - బిజెపి

ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పదవిని బిజెపికి ఇవ్వమని, కీలక మంత్రి పదవులు బిజెపి ఎమ్మెల్యేలకు ఇవ్వమని, సున్నిత అంశాలని బిజెపి ప్రజాప్రతినిధులు లేవెనెత్తవద్దని.. తదితర షరతులు విధించినట్లుగా తెలుస్తోంది.

పిడిపి - బిజెపి

పిడిపి - బిజెపి

ఇందుకు కాంగ్రెస్‌తో జత కట్టేందుకు మహబూబా ముఫ్తీ ఆలోచన చేయడమే కారణమంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో పిడిపి - బిజెపి అలయెన్స్ ఉండాలంటే తాను పెట్టిన షరతులకు కమలనాథులు అంగీకరించాల్సిందేనని ఆమె అంటున్నారు.

 పిడిపి - బిజెపి

పిడిపి - బిజెపి

అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని కౌంటర్ షరతులు మహబూబా ముఫ్తీకి పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది.

 పిడిపి - బిజెపి

పిడిపి - బిజెపి

ముఖ్యమంత్రి పదవిని కొన్నేళ్లు పిడిపి, మరికొన్నేళ్లు బిజెపికి ఉండేలా కమలనాథులు షరతు విధించారని తెలుస్తోంది. దానికి మహబూబా ససేమీరా అన్నారని సమాచారం.

English summary
Jammu Kashmir comes under Governor's rule, no word yet from PDP, BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X