రాళ్లు రువ్విన ఆందోళనకారులు: సీఆర్పీఎఫ్ వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మృతి, ఉద్రిక్తత

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్‌ నౌహట్టా ప్రాంతంలో ఆందోళనకారులు సీఆర్‌పీఎఫ్‌ వాహనాన్ని చుట్టుముట్టడంతో డ్రైవర్‌ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నంలో వాహనం ముగ్గురు యువకులపై నుంచి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో శ్రీనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

 J&K: CRPF vehicle runs over 3 while trying to avoid protestors

కాగా, సీఆర్‌పీఎఫ్‌ వాహనం ఓ సీనియర్‌ అధికారిని దింపి తిరిగి వస్తుండగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు అడ్డుకుని రాళ్లు రువ్వారని పోలీసులు వెల్లడించారు. దీంతో డ్రైవర్‌ అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ఈ ఘటనతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా విమర్శలు చేశారు. తుపాకులు కాకుండా జీపులు ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+