వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దు: చేతులు కలుపుతున్న ముఫ్తీ, ఒమర్, కాంగ్రెస్, తెరపైకి కొత్త సీఎం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ సత్యపాలి మాలిక్ బుధవారం అసెంబ్లీని రద్దు చేశారు. కొంతకాలంగా అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ, సజ్జాద్‌ లొనె నాయకత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్‌లు తమకు ప్రభుత్వ అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాయి.

ముఫ్తీకి కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్స్‌లు మద్ధతు ఇచ్చాయి. సజ్జద్ లోనెకు బీజేపీ అండగా నిలిచింది. అయితే గవర్నర్‌ అసెంబ్లీ రద్దుకు మొగ్గు చూపారు. అసెంబ్లీలో ఎక్కువ మంది సభ్యుల మద్ధతు కలిగిన పక్షంగా పీడీపీ ఉంది. దీంతో పాటు కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్సు మద్ధతు ప్రకటించడంతో మొత్తం 89 మంది సభ్యులు (ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులు) కలిగిన సభలో తమ బలం 56కు పెరిగిందని, దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌కు పీడీపీ లేఖ రాసింది.

నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ముఫ్తీకి మద్ధతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మాత్రం కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్సులు ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించలేదని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ రద్దు అనంతరం మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుది.

J&K Governor Dissolves Assembly Amid Race To Form Government, PDP, NC and Congress set to join hands

ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు

పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలి ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముదుకు వచ్చాయి. ముఖ్యమంత్రి రేసులో పీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అల్తాఫ్ బుఖారీ ఉన్నారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలతో కూడిన అలెయన్స్‌ను ఒమర్ అబ్దుల్లా లీడ్ చేయాలని ముఫ్తీ కోరుకుంటున్నారు. కానీ ఒమర్ (నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత) మాత్రం ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని, కేబినెట్లో చేరవద్దని భావిస్తున్నారు. అయితే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆజాద్ చెప్పడం గమనార్హం.

గవర్నర్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని జమ్ము కాశ్మీర్ బీజేపీ అధ్యక్షులు రవీందర్ రైనా అన్నారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, పీడీపీలు కుట్రలు చేస్తున్నాయని, వారితో రాష్ట్రానికి న్యాయం జరగదని చెప్పారు. ఎన్నికలకు ముందు వారు పొత్తు పెట్టుకొని పోటీ చేయగలరా అని సవాల్ విసిరారు.

గవర్నర్ నిర్ణయపై ముఫ్తీ కోర్టుకు వెళ్లాలని కాగ్రెస్ పార్టీ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ అన్నారు. కేంద్రం సూచనల మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ముఫ్తీకి గవర్నర్ బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిందని చెప్పారు.

English summary
Senior PDP leader and former FM Altaf Bukhari is the frontrunner for the post of chief minister. Sources say that while PDP president Mehbooba Mufti wanted Farooq Abdullah to lead the alliance, NC has decided not to be part of the government and support the PDP-Congress alliance from outside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X