వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీడీపీకి మద్దతిచ్చేది లేదు, మోడీకి అప్పుడే చెప్పా: ఆజాద్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ స్పందించారు.

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పరిణామాలు మంచివేనని ఆజాద్‌ అన్నారు. అయితే, పీడీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణానికి తెరపడటంతో జమ్మూకాశ్మీర్‌ ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. మూడేళ్ల పాలనలో చాలా మంది పౌరులు, సైనికులు మృతి చెందారని వివరించారు.

J&K: Governors rule imminent as Congress shirks from supporting Mehbooba

ఈ కూటమి రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేసిందని మండిపడ్డారు. పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే హిమాలయాలంత తప్పు చేస్తున్నారని తాను గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు ఆజాద్‌ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నిజమయ్యాయని అన్నారు.

English summary
With the BJP having withdrawn its support from the Mehbooba Mufti-led government in Jammu and Kashmir, the PDP can remain in power only if the Congress and four independent MLAs back it, but the grand old party has not shown its willingness to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X