వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ బదిలీ, జమ్ముకు గిరీశ్, లడాఖ్‌కు రాధాకృష్ణ, 31 నుంచి బాధ్యతలు

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గోవాకు గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. మాజీ ఐఏఎస్ అధికరులు గిరీశ్ చంద్ర ముర్ము, రాధాకృష్ణ మథూర్‌కు బాధ్యతలు అప్పగించింది.

ఈ నెల 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మనుగడలోకి వస్తాయి. ఆ రోజు నుంచి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లు బాధ్యతలు స్వీకరిస్తారు. సత్యపాల్ మాలిక్ గతంలో బీహర్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. 1989 నుంచి 1991 వరకు అలీఘడ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి 1980-86, 1986-1992 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

J&K Governor Satya Pal Malik transferred, to be governor of Goa

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయన 1985వ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. గుజరాత్ క్యాడర్ తీసుకొని సమర్థంగా విధులు నిర్వర్తించారు. ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గిరీశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. రాధాకృష్ణ కూడా ఐఏఎస్ క్యాడర్‌కు చెందినవారు. లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు.

English summary
jammu and Kashmir Governor Satya Pal Malik has been transferred and appointed as Governor of Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X