వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులతో తెగబడ్డ పాక్: భారత జవాను మృతి, మరో నలుగురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. మోర్టారు షెల్లింగ్, చిన్న ఆయుధాలతో పాకిస్థాన్ కాల్పులు జరపడంతో ఓ భారత జవాను అమరుడయ్యారు. మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.

సరిహద్దు గ్రామాలు, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మంగళవారం కాల్పులు జరిపింది. పూంఛ్‌లోని కృష్ణఘటి సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం మొదట కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ధీటుగా జవాబిచ్చాయి.

 J&K: Jawan martyred, 4 injured in Poonch as Pakistan violates ceasefire along LoC

పాక్ కాల్పుల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్(36) అనే జవాను అమరుడయ్యారు. రంజన్ కుమార్ చాలా ధైర్యవంతుడని, సిన్సియర్ జవాను అని ఓ భద్రతాధికారి తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అలర్పించిన వారి త్యాగాలను ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.

సరిహద్దు వెంబడి కొన్ని గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించారు. కాగా, రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్ సమీపంలో పాకిస్థాన్ గతవారం జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను అమరుడయ్యారు. పాకిస్థాన్‌కు కూడా ఎదురుకాల్పుల్లో నష్టం జరిగిందని భారత అధికారులు తెలిపారు.

English summary
An Army jawan was martyred, four others were injured on Tuesday as Pakistan violated ceasefire by resorting to mortar shelling and small arms firing on forward posts and villages along the Line of Control (LoC) in Poonch district, reports said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X