• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాసేపట్లో లోక్ సభ ముందుకు కాశ్మీర్ విభజన బిల్లు..విస్తృత చర్చ: గెలుపు లాంఛనమే?

|
  లోక్ సభ ముందుకు కాశ్మీర్ విభజన బిల్లు || J&K Bifurcation Bill To Be Taken Up In Lok Sabha Today

  న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు మంగళవారం లోక్ సభ సమక్షానికి రానుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి లోక్ సభ మూడొంతులకు పైగా మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. అయినప్పటికీ-దీనిపై విస్తృత చర్చ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అడిగిన ప్రతి సభ్యుడినీ మాట్లాడించడానికి, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి వీలు ఉందని అంటున్నారు.

  జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తిస్తూ రూపొందించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు ఎకాఎకిన ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ గెజిట్ సైతం అప్పటికప్పుడు జారీ చేశారు. అనూహ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యావత్ దేశాన్ని క్షణంపాటు నివ్వెరపోయేలా చేసింది. మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు ప్రజలు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఈ చర్యను స్వాగతించారు.

  J&K loses special status, bifurcation Bill to be taken up in Lok Sabha today

  లోక్ సభ బలబలాలివే..

  ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ కూటమికి 353 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో భారతీయ జనతాపార్టీకి సొంతంగా 303 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి 106 మంది సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే అవుతుంది. అయినప్పటికీ- దీనిపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిష్ఠాత్మకం, చారిత్రాత్మకమైన బిల్లు కావడం వల్ల మెజారిటీ సభ్యుల మనోగతాన్ని, అభిప్రాయాలను తెలుసుకోవడానికి అవకాశం కల్పించవచ్చని చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపొందించే బిల్లు విషయంలో తటస్థ, కొన్ని ప్రత్యర్థి పార్టీలు సైతం ఎన్డీఏ కూటమికి బాసటగా నిలిచాయి.

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్ వంటి తటస్థ పార్టీలు రాజ్యసభలో ఎన్డీఏకు మద్దుతు ఇచ్చిన విషయం తెలిసిందే. బిల్లుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఇదే పరిస్థితి లోక్ సభలో కూడా తలెత్తడం ఖాయమే. వైఎస్ఆర్ సీపీ నుంచి గెలుపొందిన 22 మంది సభ్యులు, టీఆర్ఎస్ కు చెందిన ఎనిమిది మందీ బిల్లుకు అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో బీజేపీకి అండగా నిలిచింది. ముగ్గురు టీడీపీ ఎంపీలు బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారు.

  English summary
  J&K loses special status, bifurcation Bill to be taken up in Lok Sabha today. With the Centre's decision to scrap the special status to Jammu and Kashmir guaranteed under Article 370 of the Constitution, political disagreement has also taken centrestage, experts have raised questions on the legality of the move.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X