వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో పోల్: ఐదు రోజుల్లో జిల్లా పంచాయతీ, తహసిల్ పోరు, అమిత్ షా ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఆర్టికల్ 370 రద్దుచేసి, జమ్ముకశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగం చేసిన తర్వాత కశ్మీర్‌ గుంభనంగా ఉన్నాయి. భద్రతా బలగాల జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ 11 రోజులు కశ్మీర్‌లో ఉండి పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. అయితే కశ్మీర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కశ్మీర్‌లో మూడురకాల పంచాయతీ వ్యవస్థ ఉంది. మరో ఐదురోజుల్లో కశ్మీర్, లడాఖ్‌లోని జిల్లా పంచాయతీ, తహసిళ్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. పంచాయతీలతో కశ్మీర్ అభివృద్ది చెందుతుందని భావిస్తున్నానని అమిత్ షా తెలిపారు. పంచాయతీల అభివృద్ధి కోసం 40 వేల మంది పనిచేస్తున్నారని అమిత్ షా తెలిపారు.

j&k panchayat polls to be announe 5 days

తహసిల్, జిల్లా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టతనిచ్చారు. ఆయా పంచాయతీల అభివృద్ధి కోసం రూ. 70 వేల కోట్లు వ్యయం చేస్తామని పేర్కొన్నారు. ఈ నగదు సర్పంచ్‌ల బ్యాంకు ఖాతాల్లో చేరుతుందని తెలిపారు. నగదు సెక్రటరీల స్థాయికి రాదని, సర్పంచ్‌ల పర్యవేక్షణలో అభివృద్ధికి కేటాయించామని పేర్కొన్నారు.

గత నెల 5న కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుచేసి కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేశారు. దీంతో కశ్మీరీలతోపాటు ఇతరులకు హక్కులు కలిగాయి. కశ్మీర్‌లో ఇతర ప్రాంతాలకు చెందినవారు వ్యాపారం చేయొచ్చు, భూములు కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది. దీంతోపాటు కశ్మీరీలను పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఏర్పడింది. మరోవైపు కశ్మీరీల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని నరేంద్ర మోడీ సర్కార్ స్పష్టంచేసింది.

English summary
schedule for Tehsil and Zila panchayat elections in Jammu and Kashmir will be announced in the next four to five days, Union Home Minister Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X