వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుఖారీని చంపింది పాకిస్థాన్ ఎల్టీ ఉగ్రవాదులే: ఓ కాశ్మీరీ సహకారం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: సీనియర్‌ పాత్రికేయుడు, రైజింగ్‌ కాశ్మీర్‌ సంపాదకుడు షుజాత్‌ బుఖారీని హత్య చేసింది పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని జమ్మూకాశ్మీర్‌ పోలీసులు తేల్చారు. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు, మరో కాశ్మీరీ యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.

అంతేగాక, బుఖారీ హత్యకు పాకిస్థాన్‌లోనే కుట్ర పన్నారని కాశ్మీర్‌ జోన్‌ ఐజీ స్వయం ప్రకాశ్‌ తెలిపారు. నిందితుల ఫొటోలను కూడా గురువారం పోలీసులు విడుదల చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వాటి ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

J&K Police cracks Shujaat Bukhari murder case

'బుఖారీని లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హత్య చేశారు. పాకిస్థాన్‌ నుంచే ఇందుకు కుట్ర పన్నారు. దీనికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయి' అని స్వయం ప్రకాశ్‌ వెల్లడించారు. కాగా, కాగా.. నిందితుల్లో ఒకర్ని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే ఉగ్రవాది నవీద్‌ జాట్‌గా ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్న నవీద్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరిసింగ్‌ ఆసుపత్రిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో తప్పించుకున్నాడు. జూన్ 14న బుఖారీ ఈ ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

English summary
Kashmir Police have identified the murderers of 'Rising Kashmir' Editor Shujaat Bukhari. Also, J&K cops released the pictures of four accused involved in the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X