వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేర్పాటువాద నాయకురాలు ఆసియా అంద్రాబీ అరెస్ట్

వేర్పాటువాద నాయకురాలు ఆసియా అంద్రాబీని గురువారం కాశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. యువతను వేర్పాటువాదం వైపు మళ్లించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందనే ఆరోపణలున్న నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వేర్పాటువాద నాయకురాలు ఆసియా అంద్రాబీని గురువారం కాశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. యువతను వేర్పాటువాదం వైపు మళ్లించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందనే ఆరోపణలున్న నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా రక్షణ చట్టం కింద ఆమెను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

కాగా, ఇస్లామిస్ట్‌ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్‌-ఇ-మిల్లాట్‌కు అంద్రాబీ నాయకురాలు. అంతేగాక, ఆల్‌ పార్టీస్‌ హురియత్‌ కాన్ఫరెన్స్‌లోనూ ఆమె సభ్యురాలు. కాశ్మీర్‌లోయలో యువతను రెచ్చగొట్టేలా ఆసియా అంద్రాబీ తన ప్రసంగాలు కొనసాగిస్తోంది.

J&K: Separatist leader Asiya Andrabi arrested

అంద్రాబీ ప్రసంగాలు తమ శిక్షణ శిబిరాల్లో ప్రసారం చేస్తారని గతంలో కొందరు ఉగ్రవాదులు చెప్పడంతో ఆమెపై నిఘా పెట్టాయి భద్రతా దళాలు. మరోవైపు ఆమెపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కూడా భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ పోలీసులు గురువారం తెల్లవారుజామున ఆమెను అరెస్టు చేశారు. భద్రతాసిబ్బందిపైకి మహిళలు రాళ్లు విసరడం వెనుక అంద్రాబీ ప్రోత్సాహం ఉన్నట్లు తెలిసింది. కాగా, వేర్పాటు వాద నాయకుడు, హిజ్బుల్ ముజాహిదీన్ నేత ఆషిఖ్‌ హుస్సేన్‌ ఫఖ్తూ భార్యే ఈ ఆసియా అంద్రాబీ. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నాడు.

కాగా, కుప్వారాలో గురువారం ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగగా.. మేజర్ తోపాటు ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పులు కొనసాగుతున్నాయి.

English summary
With the law and order situation in the valley deteriorating in the past few days, separatist leader Asiya Andrabi was arrested on Thursday, said reports.
Read in English: Asiya Andrabi arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X