వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము కాశ్మీర్ సెక్రటేరియట్‌పై ఇక త్రివర్ణ పతాకం ఒకటే.. రాష్ట్ర ప్రత్యేక జెండాను దించిన అధికారులు

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో అప్పుడే రాష్ట్ర జెండాలను దించి జాతీయ జెండాలను మాత్రమే ఎగరవేశారు. శ్రీనగర్‌లోని సెక్రటేరియట్‌లో భవనంపై జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి అధికారికంగా ఉన్న ప్రత్యేక జెండాను దించారు. సెక్రటేరియట్‌పై మూడు రంగుల జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ నెల 5న జమ్ము కశ్శీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..దీంతో అక్టోబరు 31నుండి జమ్ము కశ్మీర్ విభజన కూడ అధికారికంగా అమల్లోకి రావడంతోపాటు కేంద్ర ప్రాలిత ప్రాంతాలుగా కోనసాగనున్నాయి. దీంతో ఇప్పటివరకు ఉన్న రెండు జెండాల సంసృతికి చరమగీతం పాడుతున్నారు స్థానిక ప్రభుత్వ అధికారులు. ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్ము కశ్మీర్, లెఫ్టినెంట్ గవర్నర్ల పాలనలోకి వెళ్లనుంది.

అధికారిక వేడుకల్లో జాతీయ జెండాతోపాటు కశ్మీర్ జెండా

అధికారిక వేడుకల్లో జాతీయ జెండాతోపాటు కశ్మీర్ జెండా

ఆర్టికల్ 370 ప్రకారమే కశ్మీర్‌కు ప్రత్యేక జెండా హక్కు కల్గి ఉంది. దీంతో ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాల్లో జాతీయ జెండాతోపాటు రాష్ట్ర జెండాను ఎగరవేస్తారు. కాగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర జెండా పూర్తిగా ఎరుపు రంగులో ఉండడంతోపాటు మూడు గీతలను కల్గి ఉంటుంది. గత డెబ్బై సంవత్సరాలుగా కశ్మీరీలకు ఉన్న ప్రత్యేక హక్కులు రద్దు కావడంతో కోన్ని రాజకీయా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు అయిన మూడు రంగుల జాతీయ జెండాతో పాటు కశ్మీర్‌కు ప్రత్యేకంగా ఉన్న ఎరుపు రంగు జెండాను కూడ ఎగరవేసేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఫుల్‌స్టాప్ పడుతోంది. ఆర్టికల్స్ రద్దుతో కశ్మీర్‌లో సైతం త్రివర్ణ పతాకం మాత్రమే ఎగరుతోంది.

కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు

కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు

1952లో కేంద్రం, రాష్ట్ర అధికారాలను నిర్వచించే ఒప్పందంపై నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, జమ్మూ కశ్మీర్ ప్రధాని షేక్ మొహమ్మద్ అబ్దుల్లాలు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అంతకుముందు నుండే ఉన్న రాష్ట్ర జెండాపై కూడ ఒప్పందం చేసుకున్నారు. త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా ఉంటే, కశ్మీర్ జెండా రాష్ట్ర జెండాగా ఉంటుందని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రెండు జెండాలను ఎగరేసే అధికారం కూడా రాష్ట్రానికి దక్కింది. దీంతో భారత్‌లోని ఇతర ప్రదేశాల్లో జాతీయ జెండాకు ఎలాంటి స్థాయి ఉంటుందో జమ్మూకశ్మీర్‌లోనూ అలానే ఉంటుంది. అయితే, జమ్మూకశ్మీర్ స్వతంత్ర పోరాటానికి సంబంధించిన చారిత్రిక కారణాల దృష్ట్యా రాష్ట్ర జెండాకు కూడా గుర్తింపు ఉంటుంది ఒప్పందంలో పేర్కొన్నారు.

ఎన్నోసార్లు జాతీయ జెండాను అవమానాల పాలు చేసిన ప్రత్యేక వాదులు

ఎన్నోసార్లు జాతీయ జెండాను అవమానాల పాలు చేసిన ప్రత్యేక వాదులు

కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉండడంతో భారత జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని కశ్మీర్ ప్రత్యేక వాదులు అవహేళన చేసేవారు. పోరుగు దేశమైన పాకిస్థాన్ జెండాను తమ జాతీయ జెండాగా అభివర్ణించడంతో పాటు చాల సార్లు అవమానాలకు గురి చేసిన సంఘటనలు ఉండేవి. ముఖ్యంగా కశ్మీరీలకు ఉండే ప్రత్యేక హక్కులతో వాళ్లను ఎలాంటీ కేసులు పెట్టలేని పరిస్థితి. ఆర్టికల్ రద్దు కావడంతో జాతీయ జెండా పూర్తిగా రెపరెపలాడనుంది.

English summary
the Jammu and Kashmir state flag has been taken off the civil secretariat building in Srinagar. It is only the national flag that remains on the civil secretariat building after the momentous decision of abrogating Article 370 of the Constitution, thus stripping the state of its special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X