• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా- ఎప్పుడో తెలుసా ? -లోక్‌సభలో ప్రకటించిన అమిత్‌షా

|

తీవ్రవాద పీడిత జమ్మూ-కశ్మీర్‌ను మూడు ముక్కలు చేస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంతో పాటు గతంలో జమ్మూను వదిలివెళ్లిపోయిన కశ్మీరీ పండిట్లను వెనక్కి రప్పించే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికీ అక్కడి రాజకీయ పార్టీలు మండిపడుతూనే ఉన్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రాంతీయ రాజకీయ పక్షాలన్నీ గుప్కర్‌ అలయన్స్‌గా ఏర్పడ్డాయి. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో కేంద్రం గతంలో తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

జమ్మూ-కశ్మీర్‌పై అమిత్‌షా కీలక ప్రకటన

జమ్మూ-కశ్మీర్‌పై అమిత్‌షా కీలక ప్రకటన

2019లో ఉగ్రవాదాన్ని రూపుమాపే లక్ష్యంతో జమ్మూ-కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేసింది. దీంతో పాటు రాష్ట్ర్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లు-2019ని తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి విభజన బిల్లును ఇవాళ పార్లమెటులో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. తన ప్రసంగంలో అమిత్‌షా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పాటు భవిష్యత్తులో ఏం జరగబోతోందో సంకేతాలు కూడా ఇచ్చేశారు.

క్యాథరీన్ త్రెసా బ్యూటీఫుల్ గ్యాలరీ.. లేటేస్ట్ ఫోటోలు వైరల్

జమ్మూ-కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ?

జమ్మూ-కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ?

జమ్మూ-కశ్మీర్‌లో పరిస్ధితులను చక్కదిద్దేందుకు ఆర్టికల్‌ 370 రద్దు చేశామని, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశామని, అయితే భవిష్యత్తులో తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వబోమని తామెక్కడా చెప్పలేదని అమిత్‌షా లోక్‌సభలో గుర్తుచేశారు. విభజన బిల్లుకు కేంద్రం సవరణలు తెస్తుంటే తిరిగి రాష్ట్ర హోదా రాదని కొందరు ఎంపీలు చెప్తున్నారని, కానీ ఈ బిల్లును తీసుకొచ్చింది తానేనని, అందులో ఎక్కడా తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వబోమని చెప్పలేదని అమిత్‌షా తెలిపారు. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారని ఎంపీలను అమిత్‌షా ప్రశ్నించారు.

సరైన సమయంలో కీలక నిర్ణయం

సరైన సమయంలో కీలక నిర్ణయం

తాము జమ్మూకశ్మీర్‌ విభజన బిల్లులో తీసుకొస్తున్న సవరణల ప్రభావం రాష్ట్ర హోదాపై ఉండబోదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. సరైన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని అమిత్‌షా పునరుద్ధాటించారు. గతంలోనూ తాను ఇదే చెప్పానని ఆయన గుర్తుచేశారు. ఈ బిల్లు ద్వారా కేవలం జమ్మూ కశ్మీర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులు అరుణాచల్‌ ప్రదేశ్, గోవా, మిజోరం కేంద్ర పాలిత ప్రాంతాల క్యాడర్‌లో కలుస్తారని షా తెలిపారు.

విపక్షాలపై నిప్పులు చెరిగిన అమిత్‌షా

విపక్షాలపై నిప్పులు చెరిగిన అమిత్‌షా


జమ్మూ-కశ్మీర్‌ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టులేదంటూ కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దయి 17 నెలలైంది. ఇప్పటివరకూ మీరేం చేశారో చెప్పాలని విపక్షాలు అడుగుతున్నాయి. మీరు అధికారంలో ఉన్న 70 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీకి అమిత్‌షా కౌంటర్లు వేశారు. అప్పుడు మీరు సక్రమంగా పని చేసుంటే ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే అవసరం ఉండేది కాదన్నారు. నేను కశ్మీర్‌పై ప్రతీ అంశానికీ సమాధానం ఇస్తాను, కానీ మీరు కూడా 70 ఏళ్ల పాలనకు జవాబు చెప్పాల్సి ఉంటుందని అమిత్‌షా తెలిపారు.

English summary
Jammu and Kashmir will be given statehood "at an appropriate time", Home Minister Amit Shah said Saturday, during a Lok Sabha discussion on the J&K Reorganisation (Amendment) Bill, 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X