వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డుమ్మా .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటీమణులు నోరా ఫతేహికి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సుకేశ్ చంద్రశేఖర్‌పై దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా మరోమారు జాక్వెలిన్ విచారణకు హాజరు కాలేదు.

ఈడీ ముందు హాజరు కాని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. నటి చెప్పిన రీజన్ ఇదే

ఈడీ ముందు హాజరు కాని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ .. నటి చెప్పిన రీజన్ ఇదే

మోసగాళ్లు సుకేశ్ చంద్రశేఖర్ మరియు అతని నటుడు-భార్య లీనా మరియా పాల్‌పై మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉండగా జాక్వెలిన్ ఈడీ ముందు విచారణ దాటవేశారు. తన వృత్తిపరమైన పని ఒత్తిడి వల్ల హాజరు కాలేకపోతున్నట్టు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేర్కొన్నారు .శుక్రవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో హాజరుకావాలని దర్యాప్తు సంస్థ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని కోరినప్పటికీ ఆమె హాజరు కాలేదు. ఆమెను సోమవారం మళ్లీ హాజరు కావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, దర్యాప్తు సంస్థ అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను మరోమారు సుకేష్ చంద్రశేఖర్ దంపతుల జంటతో ఉన్న సంబంధాలపై విచారణ జరపనున్నారు.

రూ. 200 కోట్లు మోసం కేసులో సుకేష్ చంద్రశేఖర్ తో లింక్ లపై జాక్వెలిన్ కు సమన్లు

రూ. 200 కోట్లు మోసం కేసులో సుకేష్ చంద్రశేఖర్ తో లింక్ లపై జాక్వెలిన్ కు సమన్లు

ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివిందర్ సింగ్ కుటుంబాన్ని దాదాపు రూ. 200 కోట్లు మోసం చేసినందుకు చంద్రశేఖర్ మరియు లీనా మరియా పాల్‌లను ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఏజెన్సీ ఈ కేసులో బాలీవుడ్ నటీమణి నోరా ఫతేహిని కూడా విచారించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆగస్టు 30 న మొదటిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు, ఈ సమయంలో ఆమె నాలుగు గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఆమె స్టేట్‌మెంట్ నమోదు చేశారు . శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దాఖలు చేయబడింది.

జైలు నుండే రాకెట్ నడిపిన సుకేష్ చంద్రశేఖర్

జైలు నుండే రాకెట్ నడిపిన సుకేష్ చంద్రశేఖర్

ఒక సీనియర్ లా మినిస్ట్రీ ఆఫీసర్‌గా నటిస్తూ ఒక రాకెట్ డబ్బుకు బదులుగా అప్పుడు జైలులో ఉన్న శివిందర్ సింగ్ కోసం బెయిల్ పొందడానికి సహాయం చేస్తానని చెప్పటంతో శివిందర్ భార్య జూన్ 2020 నుండి 30 వాయిదాలలో 200 కోట్లు చెల్లించిందని, ఆ డబ్బు బిజెపి పార్టీ నిధుల కోసం ఉద్దేశించినదని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మరియు అప్పటి న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇద్దరూ తన పక్షాన ఉన్నారని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. సంఘటన జరిగిన సమయంలో, 21 కేసుల్లో నిందితుడైన చంద్రశేఖర్ ఢిల్లీలోని రోహిణి జైలులో ఉన్నారు. జైలు నుండే వ్యవహారం నడిపించినట్టు సమాచారం. ఈ కేసులో పలువురు జైలు అధికారులను కూడా ఈడీ అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంది.

చంద్రశేఖర్ మోసం కేసులో ఈడీ దర్యాప్తు

చంద్రశేఖర్ మోసం కేసులో ఈడీ దర్యాప్తు

ఆగస్టులో కేంద్ర ఏజెన్సీ 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి చెన్నైలో ఉన్న బంగ్లా, నగదు మరియు డజనుకు పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.అంతేకాదు అంతర్జాతీయ బ్రాండ్‌ల బూట్లు, బ్యాగులు మరియు బట్టల నుండి ₹ 20 కోట్ల విలువైన వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్ ఒక తెలివయిన మోసగాడు అని ప్రకటనలో పేర్కొంది. ఇక దాదాపు ₹ 200 కోట్ల వరకు నేరపూరిత కుట్ర, మోసం మరియు దోపిడీ కేసులో ఈడీదర్యాప్తు చేస్తుంది.

English summary
The ED had earlier asked Jacqueline Fernandez to appear at its office in Delhi on Friday but she didn't show up. She has been summoned again on Monday in Rs 200 crore money laundering case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X