వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ విజయ వీరుడు అంటూ శివసేన ప్రసంశల వర్షం .. మమతపై విమర్శల అస్త్రం

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఇక ఈ నేపధ్యంలో శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. జగన్ పై ప్రసంశల వర్షం కురిపించి మమతా బెనర్జీపై విమర్శల అస్త్రం సంధించింది.

జగన్ విజయ వీరుడు అంటూ ప్రశంసించిన శివసేన అధికారిక పత్రిక సామ్నా

జగన్ విజయ వీరుడు అంటూ ప్రశంసించిన శివసేన అధికారిక పత్రిక సామ్నా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్‌ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. గురువారం వారి అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో వ్యాఖ్యలు చేసిన శివసేన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని భారీ తేడాతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ని ‘విజయ వీరుడు'గా అభివర్ణించింది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మోడీని కలిసిన జగన్‌ ఏపీ రాష్ట్ర డిమాండ్లపై చర్చించారని శివసేన తన సంపాదకీయంలో పేర్కొంది . వాటికి మోడీ అంగీకరించినట్లు తెలిపింది. కానీ ఏపీలో బిజెపి మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసిందని వ్యాఖ్యానించింది.

వర్మ సంచలనం .. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే టీడీపీ ఓటమి అంతా మర్చిపోతారు <br /> వర్మ సంచలనం .. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడితే టీడీపీ ఓటమి అంతా మర్చిపోతారు

మమతాబెనర్జీ మోడీపై దుష్ప్రచారం చేశారంటూ మండిపాటు

మమతాబెనర్జీ మోడీపై దుష్ప్రచారం చేశారంటూ మండిపాటు

ఇక మమతాబెనర్జీపై మండి పడింది. మోడీ ప్రమాణస్వీకారానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాకపోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీపై దుష్ప్రచారం చెయ్యటంలో మమత ముందున్నారని తెలిపింది. మోడీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడితే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని విపక్షాలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాయని అన్నది. మోడీని నియంతగా ప్రచారం చేసిన వారిలో మమతా బెనర్జీ ముందున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది . మోడీ మాత్రం ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగం ప్రకారం ప్రమాణంచేస్తున్నారని తెలిపింది.

మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధానిని ఆహ్వానించనిది అందుకే అన్న శివసేన

మోడీ ప్రమాణ స్వీకారానికి పాక్ ప్రధానిని ఆహ్వానించనిది అందుకే అన్న శివసేన

ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా , ఎంతగా దుష్ప్రచారం చేసినా మోడీ మాత్రం ప్రత్యర్ధి పార్టీలను ఒక్క మాట కూడా అనలేదని మోడీ గొప్పతనాన్ని కీర్తించింది. ఇక ప్రమాణ స్వీకారానికి పాక్‌ ప్రధానిని ఆహ్వానించకపోవడంపై కూడా శివసేన స్పందించింది. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుందని వెల్లడించింది. ప్రజల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ప్రధాని మోడీ మేరునగ ధీరుడని, ఆయన తన ధైర్యంతో అన్నింటికీ సమాధానం ఇవ్వగలరని శివసేన పేర్కొంది.

English summary
The saffron party’s ally Shiv Sena has slammed Mamata Banerjee for declining invitation for PM’s swearing-in ceremony scheduled for Thursday evening.The Shiv Sena mouthpiece “Saamna”in its editorial entitled “Ishwariya Yojana” said Mamata Banerjee was amongst the foremost people who made noises that if Modi becomes Prime Minister then democracy will be in peril.It termed Jagan Mohan Reddy as “vijayi veer”,victorious and brave. Prime Minister accepted Jagan’s demands for Andhra Pradesh despite BJP losing badly in the state.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X