వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఢిల్లీకి, చంద్రబాబు యూరప్ కి..! అఖిలపక్ష భేటీకి టీడిపి దూరం..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధవారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం అన్ని పార్టీల అధ్యక్షుల సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అన్ని పార్టీల అధ్యక్షుల సమావేశం నేడు జరగనుంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై అన్ని రాజకీయ పార్టీలు చర్చిస్తున్నాయి. వీటితో పాటు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించనున్నారు. ప్రధాని మోదీ అద్యక్షతన జరగబోవు సమావేశం కాబట్టి విభజన హామీలపై జగన్ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపి వర్గాలు తెలియజేస్తున్నాయి.

 తెలంగాణ నుండి కేసీఆర్ బదులు కేటీఆర్..! ఢిల్లీ కి పయనమైన గులాబీ యువ నేత..!!

తెలంగాణ నుండి కేసీఆర్ బదులు కేటీఆర్..! ఢిల్లీ కి పయనమైన గులాబీ యువ నేత..!!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో నేటి బుదవారం మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో జరగబోయే సమావేశంలో వీరు పాల్గొననున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మేరకు ఆయన ఆయా పార్టీలకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి కేటీఆర్‌ వెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా ఈ సమావేశానికి తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు హాజరుకావాల్సి ఉన్నప్పటికి కొన్న కారణాలవల్ల ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని తెలుస్తోంది.

అఖిలపక్ష భేటీకి టీడీపీ దూరం..! కేంద్ర సంర్కార్ పై అసంతృప్తే కారణం..!!

అఖిలపక్ష భేటీకి టీడీపీ దూరం..! కేంద్ర సంర్కార్ పై అసంతృప్తే కారణం..!!

బుదవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరగనునుంది. కీలకమైన ఈ భేటీకి టీడీపీ హాజరుకావడం లేదని సమాచారం. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు ప్రధాని నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి ఎవరు వెళ్లాలి అనే అంశంపై చర్చించారు. అయితే, పార్టీ అధినేతలు మాత్రమే పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కోరారు... మరోవైపు రేపటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు చంద్రబాబు వెళ్లనున్నారు . ఈ నేపథ్యంలో చంద్రబాబు వెళ్లాలా? లేక పార్లమెంటరీ పార్టీ నేతను పంపాలా? అనే ఆలోచనలో కూడా చేశారు. కానీ, చివరకు ఈ భేటీకి దూరంగా ఉండాలనే చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. అజెండాలోని అంశాలపై పార్టీ నుంచి లేఖను పంపాలని నిర్ణయించారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని టీడీపీ ఈ లేఖలో కోరనుంది.

 చంద్రబాబు యూరప్ పర్యటన..! కుటుంబంతో సహా ఐదు రోజుల పర్యటన..!!

చంద్రబాబు యూరప్ పర్యటన..! కుటుంబంతో సహా ఐదు రోజుల పర్యటన..!!

మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తన కుటుంబంతో కలిసి యూరప్‌ పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రహ్మణి, మనుమడు దేవాంశ్‌ కూడా వెళ్తున్నారు. ఈ నెల 26న ఆయన తిరిగి వస్తారు. గత వారం వెళ్లాల్సిన ఈ పర్యటనను నూతన శాసనసభ తొలి సమావేశాల కారణంగా వాయిదా వేసుకొన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో ఆయన మంగళవారం సాయంత్రం బయలుదేరి హైదరాబాద్‌ వెళ్లారు.

Recommended Video

నేడు అమరావతి రానున్న తెలంగాణ సీఎం
 ముగిసిన అసెంబ్లీ సమావేశాలు..! ప్రత్యేక హోదాపై తీర్మాణం..!!

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు..! ప్రత్యేక హోదాపై తీర్మాణం..!!

ఏపీ ఆసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. మంగళవారం ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఐదురోజులపాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ,ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, సభ్యులు ఎమ్మెల్యేలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం, స్పీకర్‌గా తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎన్నికయ్యారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ వాడీవేడిగా జరిగింది.చివరగా ప్రత్యేక హోదాపై శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

English summary
AP Chief Minister YS Jaganmohan Reddy visited New Delhi on Wednesday. CM Jagan will attend the meeting of all party presidents in the afternoon. TRS Working President KTR is scheduled to visit Delhi on Wednesday. They will be attending a meeting of Parliamentary Affairs Minister Prahlad Joshi on Wednesday afternoon in Delhi. An all-party meeting chaired by Prime Minister Narendra Modi will be held in Delhi. Information that TDP does not attend this crucial meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X