వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 2.0 టీంలో జై శంకర్ : మాజీ విదేశాంగ కార్యదర్శికి చోటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మోడీ క్యాబినెట్ కొలువుదీరింది. మొత్తం 42 మందికి తొలి విడత చోటు దక్కింది. మరో 39 మందిని మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించే వీలుంది. 42 మందిలో 29 మంది పాత మంత్రులే. వీరిలో 13 మంది కొత్తవారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ క్యాబినెట్‌లో చాలా విశేషాలు కూడా ఉన్నాయి.

శంకర్‌కు స్థానం
మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్‌ను క్యాబినెట్‌లోకి తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు మోడీ. బ్యూరోక్రాట్లతో పొలిటిషియన్స్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటం సాధారణమే .. కానీ క్యాబినెట్‌లోకి తీసుకోవడం మాత్రం అరుదు. కానీ మోడీ అందరి అంచనాలను వమ్ము చేసి జై శంకర్‌ను తన టీంలో చేర్చుకున్నారు. సాయంత్రం మోడీ ఇంటికి శంకర్ రావడంతో ఊహాగానాలు వినిపించాయి. చివరికి ఆయనకు క్యాబినెట్ బెర్త్ ఖాయమైంది.

jai shanker on modi team

దౌత్యనీతి భేష్
విదేశాంగ కార్యదర్శిగా జై శంకర్ సమర్థంగా విధులు నిర్వర్తించారు. అయితే ఆయన పేరు మాత్రం బాలాకోట్ దాడుల తర్వాత తెలిసింది. పుల్వామా దాడిని నిరసిస్తూ ఈ ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్ర శిబిరాలపై వైమానిక దళం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాకు దాడుల వివరాలను వెల్లడించారు జై శంకర్. ఆ సమయంలోనూ ఆయన తెలివిగా వ్యవహరించారు. వైమానిక దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది ? వైమానిక దాడులంటే ఏంటీ ? ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు. తర్వాత పాక్ చెరలో చిక్కిన అభినందన్ వర్ధమాన్ ను తిరిగి స్వదేశానికి రప్పించడంలో అనుసరించిన ప్రభుత్వ వైఖరి ... జై శంకర్ నిర్ణయాలే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమర్థుడైన అధికారి సేవలను వినియోగించుకోవాలని మోడీ తన ప్రభుత్వంలో జై శంకర్ కు స్థానం కల్పించారు. ఆయనకు విదేశాంగ శాఖకు సంబంధించి పోర్టు పోలియా ఇఛ్చే చాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
Modi Cabinet 42 member in the first place. Another 39 people can be included in the ministerial extension. Of the 42 people, 29 are old ministers. Of them 13 were new. These include Kisan Reddy from Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X