వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాళీల ఆరాధ్య దైవం దుర్గామాతే.. రాముడి కొలవమన్న అమర్త్యసేన్

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. ఆర్థిక వ్యవస్థ, నేతల వ్యవహారశైలిని తప్పుపట్టారు. కొందరు తమ ఇష్ట దైవాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. అలా కాదని అందరినీ సమానస్థాయిలో చూడాలని, కుల, మతాల పేరుతో దాడులు చేయొద్దని సూచించారు.

కీలక వ్యాఖ్యలు ..
ఇటీవల బీజేపీ అనుబంధ సంస్థల దాడులు పెరిగిపోయాయి. జై శ్రీరాం, జై హనుమాన్ అనాలని చావకొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో అమర్త్యసేన్ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జాదవ్‌పూర్ వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన . బెంగాలీ సంస్కృతి సాంప్రదాయం దుర్గా మాతాతో ముడిపడి ఉన్నదని స్పష్టంచేశారు. కానీ రాముడితో అవినభావ సంబంధం లేదని .. బెంగాళీలు పూజించరని కుండబద్దుల కొట్టి మరీ చెప్పారు. బెంగాళీల జీవితంలో సర్వంతర్వామి అయిన దుర్గామాత అనుసంధానమై ఉందని గుర్తుచేశారు.

Jai Shri Ram is not associated with Bengali culture: Nobel laureate Amartya Sen

దుర్గామాతే మిన్న ..
అంతేకాదు శ్రీరామనవమికి ఇటీవల ప్రాధాన్యం వచ్చిందనే గుర్తుచేశారు. కానీ బెంగాల్‌లో రాముడి కన్నా .. తమకు దుర్గామాతే మిన్న అని చెప్పారు. అంతేకాదు తన నాలుగేళ్ల మనవరాలిని నీకు ఏ దేవుడంటే ఇష్టమని ప్రశ్నిస్తే .. సంకోచించకుండా దుర్గామాత అని చెప్పిందని పేర్కొన్నారు. ఇటీవల కొందరు జై శ్రీరాం అనాలని దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆర్థికవేత్త అమర్త్యసేన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం కలిగింది. బడ్జెట్ గురించి ప్రశ్నించగా .. దేశ ఆదాయం పెరిగితే పేదప్రజలు అభివృద్ధి చెందరని గుర్తుచేశారు. దేశంలో పేదరికం తగ్గాలంటే సరైన విద్యా, సామాజిక భద్రత, వైద్యారోగ్యం చాలా కీలకమని నొక్కి వక్కానించారు.

English summary
nobel laureate economist Amartya Sen on Friday said unlike 'Maa Durga', the 'Jai Sri Ram' slogan is not associated with the Bengali culture and it is used as "a pretext to beat up people". It is 'Maa Durga' who is omnipresent in the lives of Bengalis, Sen said while speaking at a programme in the Jadavpur University here. "Jai Sri Ram slogan is not associated with the Bengali culture," he said, adding that even Ram Navami is "gaining popularity" nowadays and he had "never heard of it before". "I asked my four-year-old grandchild who is your favourite deity? She replied that it is Maa Durga. Maa Durga is so much omnipresent in our lives," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X