వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్యా.. ఎట్టకేలకు అనుమతి.. లాయర్‌తో మాట్లాడిన జర్నలిస్ట్ సిద్దిఖీ, 5 నిమిషాలే,, ఫోన్‌లో...

|
Google Oneindia TeluguNews

కేరళ జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్‌తో మాట్లాడేందుకు ఎట్టకేలకు అవకాశం దక్కింది. అతని లాయర్‌ కలిసేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్.. ఢిల్లీ యూనిట్ ప్రతినిధులు తెలిపారు. హత్రాస్ బాధితురాలి హత్యకు సంబంధించి వార్త కవర్ చేసేందుకు వెళ్లిన సిద్దిఖీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత 50 రోజుల నుంచి అతను జైలులోనే మగ్గుతున్నాడు.

హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత మహిళ దారుణ హత్యకు గురవడంపై వార్త కవర్ చేసేందుకు సిద్దిఖీ అక్టోబర్ 5వ తేదీన బయల్దేరారు. బూల్ ఘడ్ బయల్దేరగా టోల్ ప్లాజా వద్ద పోలీసలు అరెస్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన పోలీసుల కస్టడలో ఉన్నారు. కానీ చివరికి మంగళవారం సాయంత్రం లాయర్ కలిసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రింట్ రిపోర్ట్ చేసింది. తన లాయర్‌తో 5 నిమిషాలు ఫోన్ కాల్ మాట్లాడరని తెలిపారు. ఈ సమయంలో సరైన ఆహారం ఇస్తున్నారా..? మందులు ఇస్తున్నారా అనే విషయాలను లాయర్ విల్స్ మాథ్యూస్ అడిగారు.

Jailed Kerala journalist gets to talk to lawyer for 5 mins 49 days after arrest

సిద్దిఖీ అరెస్ట్‌పై కేరళ జర్నలిస్ట్ యూనియన్ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. కస్టడీ నుంచి సిద్దిఖీని విడుదల చేయాలని కోరింది. దీంతోపాటు యూపీలోని మథురలో కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు.

English summary
Arrested on his way to cover the death of the Hathras victim in Uttar Pradesh, Kerala journalist Siddique Kappan (41) finally managed to speak to his lawyer on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X