• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Jaipur Literature Fest 2021:సాహిత్య ఉత్సవాల్లో ప్రసంగించనున్న బిల్‌గేట్స్, శశి థరూర్ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ల

|

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిటరేచర్ ఫెస్టివల్ జైపూర్ లిటెరేచర్ ఫెస్టివల్‌కు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోని పలు రంగాలకు చెందిన మేధావులు, సాహిత్యవేత్తలు, మానవతావాదులు, రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలనే ఒకే వేదికపైకి తీసుకొస్తుంది ఈ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్. ఈ వేదికపై వీరంతా తమ సృజనాత్మకతమైన ఆలోచనలను పంచుకుంటారు. మంచి చర్చను చేపడతారు. ఈ ఏడాది జరగబోయే లిటరరీ ఫెస్ట్‌కు డిజిటల్ మీడియా పార్ట్‌నర్లుగా డైలీహంట్ మరియు వన్‌ఇండియా న్యూస్ పోర్టల్‌లు వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేయనున్నాయి.

గతంలో జరిగిన జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో భారత్‌కు చెందిన రచయిత, సామాజికవేత్త అయిన హర్ష్ మందర్, తాను రాసిన పుస్తకం లాకింగ్ డౌన్ ది పూర్: ది పాండెమిక్ అండ్ ఇండియాస్ మోరల్ సెంటర్ పై చర్చ జరిగింది. సామూహిక హింస బారిన పడిన బాధితులను, ఆకలితో అలమటిస్తున్నవారితో, ఉండేందుకు ఇళ్లు లేక వీధుల్లో నిద్రిస్తున్న వారితో కలిసి తాను చేసిన ప్రయాణం, తన అనుభవాలను పంచుకున్నారు. అంతేకాదు తాను రాసిన పుస్తకంలో కూడా పొందుపర్చారు. ఇక ఈ సారి జరగబోయే జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో ప్రముఖ ఫిలాసఫర్ మైఖేల్ శాండెల్ లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌తో తన అభిప్రాయాలను అనుభవాలను పంచుకోనున్నారు. సమకాలిన రాజీకాయలపై ఈ ఇద్దరు చర్చించనున్నారు.

Jaipur Literature Fest 2021:MP Shashi Tharoor all set to take the stage on February 26

ప్రపంచీకరణ మరియు పెరుగుతున్న అసమానతతో పాటు విజయం మరియు వైఫల్యాలకు సంబంధించి పునర్నిర్వచనం ఇవ్వడంపైనే ప్రధానంగా శాండెల్ వాదన ఉండనుంది. సరికొత్త రాజకీయాలకు మార్గాన్వేషణపై ప్రసంగిస్తారు శాండెల్. ఆ తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్‌తో కాప్ 26 వాతావరణ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు అలోక్ శర్మ మాట్లాడతారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ వాతావరణంపై, వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై మాట్లాడనున్నారు. అంతేకాదు గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవలంబించాల్సి ప్రణాళికపై మాట్లాడనున్నారు. బిల్‌గేట్స్ గత కొన్నేళ్లుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై స్టడీ చేస్తున్నారు. దీనికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇక చర్చలో భాగంగా వాతావరణ విపత్తును ఎలా నివారించగలమో చెప్పనున్నారు.

ఇదిలా ఉంటే 14వ జైపూర్ సాహిత్య ఉత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 21వ తేదీన ముగిశాయి. తిరిగి ఫిబ్రవరి 26న ప్రారంభమై 28వ తేదీన ముగుస్తాయి.

English summary
The Jaipur Literature Festival, that is known as the "greatest literary show on Earth", is a sumptuous feast of ideas. Each year, several world's greatest writers, humanitarians, politicians, business leaders and entertainers are welcomed on one stage to champion the freedom to express and engage in thoughtful dialogue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X