• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫేస్‌బుక్ చిచ్చు : భార్య పాపులారిటీ తట్టుకోలేక.. నమ్మించి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

|

ఫేస్‌బుక్,వాట్సాప్,టిక్‌టాక్‌లో పాపులారిటీయే ఈరోజుల్లో సోషల్ స్టేటస్‌గా మారిపోయింది. ఇందుకోసం చాలామంది పొద్దస్తమానం అందులోనే తలదూర్చి బతికేస్తున్నారు. సోషల్ యాప్స్ వాడటంలో తప్పు లేదు గానీ వాటికి ఎడిక్ట్ అయిపోతే కుటుంబ బంధాలకు దూరమవడం ఖాయం. అదే సమయంలో సోషల్ యాప్స్ ద్వారా వచ్చే క్రేజ్,పాపులారిటీ భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా దారితీస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో భార్య పాపులారిటీని తట్టుకోలేకపోయిన ఆమె భర్త, ఆమెపై అనుమానం పెంచుకుని హత్యకు పాల్పడ్డాడు.

 అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

రాజస్తాన్‌లోని జైపూర్‌కి చెందిన అజయ్ అహ్మద్(25),రేష్మ మంగ్లాణి(22) గతంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవారు. అక్కడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. పారిపోయి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం అహ్మద్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో సోషల్ మీడియా కారణంగా చిచ్చు రేగింది.

ఫేస్‌బుక్‌తో బిజీగా ఉంటోందని..

ఫేస్‌బుక్‌తో బిజీగా ఉంటోందని..

రేష్మ చాలాకాలంగా ఫేస్‌బుక్‌లో సొంతంగా ఒక పేజీ నిర్వహిస్తోంది. ట్రావెలింగ్‌కి సంబంధించిన వీడియోలను అందులో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే భర్తతో కలిసి ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్లకు వెళ్లినా.. ఆ ఫోటోలను అందులో పోస్ట్ చేస్తుంటుంది. తద్వారా ఇప్పటివరకు ఆమెకు 6వేల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు.అయితే రేష్మ ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో బిజీగా గడపడం అహ్మద్‌కు నచ్చలేదు.

అనుమానం...

అనుమానం...

రేష్మ తనతో కంటే ఫేస్‌బుక్‌లోనే ఎక్కువ సమయం గడుపుతోందని అహ్మద్‌కు పట్టరాని కోపం వచ్చేది. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. రేష్మకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయేమోనని అహ్మద్ అనుమానించడం మొదలుపెట్టాడు. దీంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి. భర్త గొడవలను తట్టుకోలేక రేష్మ పుట్టింటికి వెళ్లిపోయింది.

 నమ్మించి తీసుకొచ్చి హత్య

నమ్మించి తీసుకొచ్చి హత్య

రేష్మ పుట్టింటికి వెళ్లిన కొన్నిరోజులకు అహ్మద్ ఆమెను తీసుకురావడానికి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఆమెకు సున్నితంగా నచ్చజెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఇద్దరం కలిసి సరదాగా అమెర్ అనే ప్రాంతానికి వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశాడు. మరుసటి రోజు ఉదయం రేష్మ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

English summary
In Jaipur, Ayaj Ahmad (25) a delivery boy with an online food company bludgeoned his 22-year-old wife Reshma Manglani because he suspected her of having an affair. He also doubted her of infedility as she spent too much time on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more