వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిడ్డకు జన్మనిచ్చిన 2 గంటలకే.. పరీక్ష కేంద్రానికి వెళ్లిన తల్లి

|
Google Oneindia TeluguNews

జైపూర్: ఎక్కడ బలమైన కోరిక ఉంటుందో.. అక్కడ అవకాశం కూడా ఉంటుందని అంజుమీనా అనే ఓ మహిళ నిరూపించింది. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. అయితే తన పరీక్షలు జరుగుతున్న సమయానికే ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోంది.

కాగా, ఓ పాపకు జన్మనిచ్చిన అంజుమీనా.. కేవలం రెండు తర్వాత తన పరీక్షలకు హాజరుకావాలని నిర్ణయించుకుంది. అంతే, ఆలస్యం చేయకుండా జైపూర్‌లోని విద్యాసాగర్ మహిళా మహావిద్యాలయంలో జరుగుతున్న పరీక్షకు హాజరైంది.

Jaipur mother reaches exam centre two hours after giving birth

రాజస్థాన్ పత్రిక కథనం ప్రకారం.. బిఏ చదువుతున్న అంజు తన ఇంటి నుంచి ఉదయం 7గంటలకు హిస్టరీ పరీక్ష రాసేందుకు బయల్దేరింది. అంతకుముందు జైపూర్‌లోని సంగనేరి ఆస్పత్రిలో ఉదయం 5గంటలకు ఆమె ఓ పాపకు జన్మనచ్చింది.

పరీక్ష రాసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇప్పుడు పరీక్ష రాయకపోతే ఏడాది మొత్తం వృథా అయ్యేదని చెప్పింది. కాగా, కళాశాల అధికారులు కూడా ఆమె పరీక్ష రాసేందుకు తగిన ఏర్పాటు చేసి సహకరించారు.

English summary
Where there is a will, there is a way and Jaipur's Anju Meena has proved this famous saying. Two hours after giving birth to a baby, Anju Meena decided to give her examination at Mahila Mahavidyala, Vidyasagar in Jaipur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X