వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైరాం రమేష్ వల్లే యూపీఏ-2 పాలసీలకు పెరాలసిస్: థరూర్‌పైనా మొయిలీ ఫైర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ఉన్న విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే నాయకత్వ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కూడా ఒకరిఒకరు విమర్శలు చేసుకుంటూ రోడ్డునపడుతున్నారు. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం వీరప్ప మొయిలీ మరో సీనియర్ నేత అయిన జైరాం రమేష్‌పై బుధవారం తీవ్ర విమర్శలు చేశారు.

నాగా బెటాలియన్ మహిళల సత్తా తెలుసంటూ ఆనంద్ మహీంద్ర: ఏం చేశారంటే..(వీడియో)నాగా బెటాలియన్ మహిళల సత్తా తెలుసంటూ ఆనంద్ మహీంద్ర: ఏం చేశారంటే..(వీడియో)

యూపీఏ-2 ప్రభుత్వం పాలసీలకు పక్షవాతం రావడానికి జైరాం రమేషే కారణమంటూ వీరప్ప మొయిలీ విరుచుకుపడ్డారు. సరైన పనులు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ నేత శశిథరూర్‌పైనా మండిపడ్డారు. జైరాం రమేష్ కూడా ప్రధానిపై సానుకూల వ్యాఖ్యలు చేయడం మొయిలీకి నచ్చలేదు.

Jairam Ramesh responsible for UPA-2’s policy paralysis: Veerappa Moily

ఇది చాలా విచారకరమన్న వీరప్ప మొయిలీ.. కాంగ్రెస్ నాయకత్వం ఈ ఇద్దరు నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎప్పుడూ తప్పు పట్టడం వల్ల మనకు ఒరిగేదేమీ లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించడంపై మొయిలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీజేపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు కాంగ్రెస్ పార్టీలో ఎలా కొనసాగుతారని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులను ఎంజాయ్ చేసి.. ప్రతిపక్షంలోకి రాగానే అధికార పక్షానికి సానుకూలంగా ఉంటారా? అని ప్రశ్నించారు.

యూపీఏ-2 ప్రభుత్వం చేపట్టిన పాలసీలకు పక్షవాతం రావడానికి జైరాం రమేషే కారణమని వీరప్ప మొయిలీ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలకు ఆయనే కారణమని మండిపడ్డారు. ఇలాంటి వారిపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

English summary
Senior Congress leader M Veerappa Moily alleged on Wednesday Jairam Ramesh was responsible for “policy paralysis” during the UPA-2 government as he hit out at him over his controversial remarks on the Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X