వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి ముంబాయిఫికర్...? కశ్మీర్‌కు బదులుగా ముంబాయిని టార్గెట్ చేసిన తీవ్రవాదులు

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ విభజన పరిణామాలు భారత్‌పై దాడులకు పురిగోల్పుతున్నాయి. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులు అందుకు వ్యతిరేకంగా మరోసారి భారత్‌లో దాడులు చేసే కుట్రలకు తెరలేపారని గుఢాచార వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కశ్మీర్‌లోని భద్రతా దళాలపై దాడులతో పాటు భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రలకు తెరతీసినట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే ముంబాయిలో దాడులు కొనసాగించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ కుట్ర పన్నినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

పుల్వామా దాడులు తప్పవని హెచ్చిరించిన పాకిస్థాన్

పుల్వామా దాడులు తప్పవని హెచ్చిరించిన పాకిస్థాన్

కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370తోపాటు ఆర్టికల్ 35ఏలను తోలగించడంతో కశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విడగోడుతూ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన పాకిస్థాన్ అత్యసవర సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకుంది. సమావేశం అనంతరం పాకిస్థాన్ బహిరంగగానే భారత నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ సంధర్భంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత దేశ చర్యతో మరోసారి పుల్వామా తరహా దాడులు కొనసాగవచ్చని హెచ్చరించాడు. ఇది పాకిస్థాన్ చర్యగా పేర్కోంటు భారత్ దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని , దీంతో రెండు దేశాల మధ్య యుద్దానికి దారీ తీయవచ్చని ఘాటుగా స్పందించారు. యుద్దం వల్ల ఎవరికి లాభం ఉంటుంది. యుద్దంలో ఎవరు గెలుస్తారు అంటూ హెచ్చరించారు.

ముగ్గురు సభ్యుల బృందంతో దాడులకు యత్నం

ముగ్గురు సభ్యుల బృందంతో దాడులకు యత్నం

పాకిస్థాన్ ప్రధాని హెచ్చరించినట్టుగా జైష్ ఏ మహ్మద్ సంస్థ భారత ఆర్ధిక రాజధాని ముంబాయిపై దాడులకు కుట్రపన్నినట్టు సమాచారం. ఇందుకోసం జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు రావుఫ్ అజ్‌ఘర్ పాకిస్థాన్ సమావేశం తర్వాత పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు వార్తలు వెలువడ్డాయని ఇంటలీజెన్స్ అధికారి ఒకరు చెప్పారు. కాగా రావుఫ్ అజ్‌ఘర్ పెద్ద సంఖ్యలో ఉగ్రవాద నియామాకాలు చేశాడనే వార్తలు కూడ వెలువడ్డాయి. దీంతో భారతదేశంలోని కీలక ప్రాంతాల్లో దాడులు చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ముంబాయిపై దాడులు చేసేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని కూడ నియమించినట్టు సమాచారం.

ముంబాయి పోలీసులకు ముందస్తు సమాచారం..

ముంబాయి పోలీసులకు ముందస్తు సమాచారం..

ఇక కశ్మీర్‌లో భారత దళాలపై దాడుల సమాచారం నేపథ్యంలోనే జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ కశ్మీర్‌లో భద్రతా దళాల అధికారులతో సమావేశమయ్యారని తెలుస్తోంది. మరోవైపు ముంబయి దాడులపై కేంద్ర నిఘా వ్వవస్థ ముంబాయి పోలీసులకు సమాచారం అందించి అలర్ట్ చేసిందని అధికారులు సమాచారం అందించారు. కాగా గతంలో కూడ ముంబాయిని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడిన నేపథ్యంలో సెక్యూరిటి సిబ్బంది అలర్ట్ అయ్యారు.

English summary
Jaish-e-Mohammed terrorist group, is looking to scale up attacks on security forces in Jammu and Kashmir as well as economic targets in cities such as Mumbai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X