వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేడ్- సీ కశ్మీరీలతో దాడులు .. పుల్వామా దాడిలో జైషే న్యూ స్ట్రాటజీ .. ఇంటెలిజెన్స్ వర్గాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సీఆర్పీఎఫ్ జవాన్లు. దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడతారు. తమ క్యాంపు మరో చోటికి వెళ్తున్న విషయం అంత తేలిక ఎలా తెలుస్తోంది. అది 70కి పైగా వాహనాల్లో ట్రావెల్ చేస్తున్న విషయాన్ని ఉగ్రవాదులు ఎలా పసిగట్టారు. ఒకవేళ తమ ఆపరేషన్ విఫలమైతే ఏమవుతుందోనని టెన్షన్ ఉగ్ర మూకలకు ఉంటుంది. వీటన్నింటికి సమాధానం జైషే మహమ్మద్ అనుసరించిన గ్రేడ్- సీ టెక్నిక్ అని స్పష్టమవుతోంది.

ఏంటీ గ్రేడ్-సీ

ఏంటీ గ్రేడ్-సీ

నిర్దేశిత లక్ష్యాన్ని దాడి చేసేందుకు ఉగ్రవాదులు కూడా వ్యుహరచన చేస్తుంటారు. అయితే పుల్వామా దాడితో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. జైషే మహమ్మద్ సంస్థ వ్యుహాత్మక దాడులు అంశం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే తమ సంస్థలో పేరుమోసిన ఉగ్రవాదులతో దాడులు చేయిస్తే నిఘా సంస్థలు తేలికగా పసిగడుతాయని అంచనా వేశారు. అలాకాకుండా కశ్మీర్ లో ఉగ్రవాదానికి ఆకర్షితులైన యువతను ఏరగా వేసింది జైషే మహమ్మద్. వారిని తమ సంస్థలో చేర్చుకొని శిక్షణ ఇచ్చి .. దాడులు చేయిస్తుంది. పుల్వామాలో దాడికి తెగబడిన ఆదిల్ అహ్మద్ దర్ ఏడాదిక్రితం జైషే మహమ్మద్ సంస్థలో చేరాడు. గ్రేడ్-సీ క్యాడర్ అయిన ఆదిల్ తో దాడి చేయిస్తే తమపై ముందుగా ఎలాంటి అనుమానం రాదని .. పని తేలికగా అవుతుందని భావించి దాడి చేయిచింది. దాడి తర్వాత ఆదిల్ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో అతడు తానే దాడి చేశానని చెప్పడంతో .. అసలు అతను ఏవరు, చరిత్ర ఏంటో నిఘా వర్గాలకు కూడా తేలికగా అర్థం కాలేదు. తర్వాత ఆరా తీస్తే 2018లో సంస్థ లో చేరినట్టు తెలియడంతో జైషే పన్నాగం బయటపడింది.

 ఎంపికకు కారణమిదీ ..?

ఎంపికకు కారణమిదీ ..?

ఎక్కడైనా దాడులు చేయాలంటే ముందుగా ప్రణాళిక రచించే జైషే మహమ్మద్ సంస్థ ... పుల్వామాకు ఆదిల్ ను ప్రయోగించి తమ ఎత్తుగడను బహిర్గతం చేసింది. ఇలా చేయడం జైషే కొత్త స్ట్రాటజీ అని ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. కశ్మీర్ లోయలో యువకులను మచ్చిక చేసుకొని ... భారత్ పై దాడి చేసేందుకు ఉసిగొల్పుతున్నాయని అంచనా వేశాయి.

ఈ స్ట్రాటజీతో ప్రమాదమే ...?

ఈ స్ట్రాటజీతో ప్రమాదమే ...?

జైషే మహమ్మద్ కొత్త స్ట్రాటజీతో మనకు డేంజర్ బెల్స్ మోగినట్టేనని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త ఎత్తుగడతో ప్రమాదం ఏటు నుంచి .. ఏ రూపంలో వస్తుందో పసిగట్టడం అంత ఈజీ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. జైషే మూలాలతోపాటు .. వారి కోవర్టులు, గ్రేడ్- సీ ఉగ్రవాదులపై మరింత ఫోకస్ చేయాలని భావిస్తున్నాయి.

ఏం చేయాలి ..?

ఏం చేయాలి ..?

మొక్క దశలో ఉన్న ఈ గ్రేడ్-సీ ఉగ్రవాద మూకలను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. లేదంటే వారితో సర్వోన్నత దేశానికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనాతో జైషే మహమ్మద్ .. ఇతర ఉగ్రవాద సంస్థల ఆటకట్టించాలి. ఇందుకు ప్రపంచ దేశాల మద్దతు తీసుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

English summary
adil Ahmad Dar, who was part of Jaish-e-Mohammed's lowest rung of terrorists and not considered a threat, was assigned the task to carry out the devastating terror attack in Pulwama on Thursday as part of the outfit's latest strategy. Intelligence officials believe Adil Ahmad Dar was categorized as a Grade C terrorist in the ranks and thus didn't invite intense scrutiny by the security agencies. This new strategy has sent the alarm bells ringing among security agencies. Intelligence officials believe this to be the new strategy of Jaish-e-Mohammed to pick up young Kashmiris who keep a low profile and can escape the strong gaze of counter-terror agencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X