వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో కీలక ఉగ్రవాది, జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ హతం

జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్‌ను ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగింది.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్‌ను ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగింది.

సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్‌ ఆపరేషనల్‌ హెడ్‌, కీలక ఉగ్రనేత అబు ఖలీద్‌ను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

బారాముల్లాలోని లాదోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతాసిబ్బంది ఉగ్రవాదిని మట్టుబెట్టారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలీద్‌.. మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది. ఉత్తర కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక ఇతడి హస్తం ఉంది.

ఈ ఎన్‌కౌంటర్‌కు కొద్ది గంటల ముందే బుద్గాం జిల్లాలోని ద్రాంగ్‌ గ్రామంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

English summary
A top Jaish-e-Mohammad terrorist, Khalid, was killed by the security forces today in Jammu and Kashmir's Baramulla. He was believed to be main plotter behind the suicide attack last week near the Srinagar airport, in which one soldier was killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X