వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలోనే ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న జైట్లీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఆరోగ్య కారణాల రీత్యా అధికారిక విధులకు దూరంగా ఉన్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ త్వరలోనే తిరిగి ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఆగస్టు రెండో వారం తర్వాత జైట్లీ విధుల్లోకి రానున్నట్లు తెలిపాయి. అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నార్త్‌ బ్లాక్‌లోని ఆయన కార్యాలయానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

Jaitley to return as Finance Minister this month

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగడంతో మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని జైట్లీకి వైద్యులు సూచించారు.

ఈ క్రమంలో గత మే నెల నుంచి ఆయన విధుల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థికశాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది కేంద్రప్రభుత్వం.

అయితే, సోషల్‌ మీడియా వేదికగా జైట్లీ గత కొద్దివారాలుగా విపక్షాల విమర్శలకు
ధీటుగా బదులిస్తున్నారు. అయితే, ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న రైల్వే మం‍త్రి పీయూష్‌ గోయల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం, సమావేశాలకు హాజరవుతుండటంతో దేశ ఆర్థిక మంత్రి ఎవరంటూ విపక్షాలు విమర్శలు చేశాయి.

English summary
Arun Jaitley will return as the Union Finance Minister later this month after a three month long hiatus. Media reports while quoting sources said that he would be back in at his North Block office this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X