పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేక లవర్‌పై గ్యాంగ్‌రేప్

పంజాబ్‌లో ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకొంటానని నమ్మించిన ప్రియుడు తన స్నేహితులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు.

జలంధర్: పంజాబ్‌లో ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకొంటానని నమ్మించిన ప్రియుడు తన స్నేహితులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. ప్రియురాలిని పెళ్ళిచేసుకొనే ఉద్దేశ్యం లేకపోవడంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకొంది.

పంజాబ్ రాష్ట్రంలోని తల్వాణ్ గ్రామానికి చెందిన బాధితురాలిని నిందితుడు హర్‌ప్రీత్‌సింగ్ హ్యాపీ గత కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నాడు. అయితే చాలాకాలం ప్రేమించుకొన్న తర్వాత పెళ్ళిచేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకొన్నారు.

అయితే బాధితురాలిని పెళ్ళిచేసుకోవడం ఇష్టంలేని హర్‌ప్రీత్‌సింగ్ ఓ పథకాన్ని వేశాడు. ఈ నెల 20వ,తేదిన బాధితురాలిని తన తల్లిదండ్రులకు పరిచయం చేయిస్తానని చెప్పి ఆమెను తీసుకెళ్ళాడు.

Jalandhar cops arrest college student who got girlfriend raped to avoid marriage

అయితే ఆమెను ఇంటి నుండి రాత్రి పదిన్నరగంటలకు బైక్‌పై తీసుకెళ్ళాడు. మార్గమధ్యలో అతని ఇద్దరు స్నేహితులు బిందు, రవిల బైక్‌లపై బాధితురాలిని ఎక్కించాడు.

తన తల్లిదండ్రులను తీసుకొస్తానని హర్‌ప్రీత్ బాధితురాలిని నమ్మించాడు. అయితే హర్‌ప్రీత్ స్నేహితులు రవి, బిందులు బాధితురాలిని నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం గదికి తీసుకెళ్ళికూడ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ కుట్రకు ప్రధాన సూత్రదారుడు హర్‌ప్రీత్‌సింగ్‌ను జలంధర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతని ఇద్దరు స్నేహితులపై పలు ఐసీపీ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులంతా ఒకే గ్రామానికి చెందినవారు. బాధితురాలి క్లాస్‌మేట్స్ కూడ అని పోలీసు విచారణలో తేలింది. బాధితురాలిని మెడికల్ టెస్టులకు పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+