వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ నన్ రేప్ కేసు: మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు బెయిల్ మంజూరు

|
Google Oneindia TeluguNews

కేరళ నన్ పై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేరళ హై కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఆయనకు మంజూరు చేసింది. నిందితుడు ములక్కల్ తన పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని హైకోర్ట్ జడ్జి జస్టిస్ రాజా విజయరాఘవన్ ఆదేశించారు. అంతేకాదు కేరళ రాష్ట్రంలో కూడా అడుగుపెట్టేందుకు వీలు లేదంటూ పేర్కొన్నారు. ఒక్క విచారణ సమయంలోనే ఆయన కేరళ రాష్ట్రంలో అడుగు పెట్టాలని అంతవరకు దూరంగా ఉండాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు అయ్యేంత వరకు ఈ షరతులు వర్తిస్తాయని కోర్టు వెల్లడించింది.

మాజీ బిషప్ ఫ్రాంకో ముల్లకల్‌కు రెండు రోజుల పోలీసు కస్టడీమాజీ బిషప్ ఫ్రాంకో ముల్లకల్‌కు రెండు రోజుల పోలీసు కస్టడీ

ఇదిలా ఉంటే అక్టోబర్ 3న బెయిల్‌పై జరిగిన వాదనల్లో హైకోర్టు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. ములక్కల్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని తను సాక్షులను ప్రభావితం చేసే అవకాశమున్నందున అతనికి బెయిల్ మంజూరు చేయరాదని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో బెయిల్ మంజూరుకు హైకోర్టు నాడు తిరస్కరించింది. ప్రస్తుతం 54 ఏళ్ల ఫ్రాంకో ములక్కల్ కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న పాలా సబ్‌జైల్‌లు ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆ సమయంలో విచారణ జరుగుతున్నందున బెయిల్ ఇవ్వరాదంటూ పోలీసులు కోర్టును కోరారు.

Jalandhar former Bishop Mulakkal gets conditional bail

జూన్‌లో తనపై అత్యాచారం చేశాడంటూ కొట్టాయం పోలీసులకు కేరళ నన్ ఫిర్యాదు చేసింది. మే 2014లో కురవిలన్‌గద్‌లోని ఓ గెస్ట్ హౌజ్‌లో తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడని చెప్పింది. చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. అయితే తనకు ఏమీ తెలియదని లేనిపోని నిందలు తనపై వేస్తున్నారని మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్ చెప్పారు.

English summary
Jalandhar Bishop Franco Mulakkal, who has been accused of repeatedly raping a Kerala nun, was on Monday granted conditional bail by the Kerala High Court.Granting the bail, Justice Raja Vijayaraghavan directed the accused Bishop to surrender his passport and not to enter Kerala except for appearing before the probe officer once in two weeks on Saturdays. This condition would be applicable till a charge sheet is filed in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X