వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి సెగ: మోడీ గారు అదంతా నిజం కాదు.. త్రిషకు విశాల్ కౌంటర్!

తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ గత మూడు రోజులుగా చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద భారీ ఆందోళన చేపట్టిన తమిళుల నిరసన సెగ డిల్లీకి తాకింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ గత మూడు రోజులుగా చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద భారీ ఆందోళన చేపట్టిన తమిళుల నిరసన సెగ డిల్లీకి తాకింది.

ఢిల్లీలోని తమిళనాడు హౌస్ ఎదుట విద్యార్థులు, యువకులు జల్లికట్టుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని నినాదాలు చేశారు. కాగా, జల్లికట్టుకు మద్దతుగా ఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఇప్పటికే ప్రధాని మోడీతే భేటీ అయిన విషయం తెలిసిందే. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధానిని కోరారు. జల్లికట్టు తమిళనాడు సంస్కృతిలో అంతర్భాగమని, అలాగే సుప్రీం దీనిపై నిషేధం విధించినందున ఏ నిర్ణయం తీసుకున్న ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోడీ చెప్పారు.

జల్లికట్టుపై విశాల్ లేఖ

జల్లికట్టుపై విశాల్ లేఖ

ఇదిలా ఉండగా, జల్లికట్టుపై జరుగుతున్న నిరసనల నేపథ్యంలో నటుడు విశాల్‌.. ప్రధాని మోడీకి బుధవారం లేఖ రాశారు. సర్‌.. తమిళనాడులో బాధాకరంగా మారిన జల్లికట్టు నిరసన విషయంలో మీ మద్దతు కోరుతూ ఈ లేఖ రాస్తున్నానని, జల్లికట్టు తమిళనాడులో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ క్రీడ అని పేర్కొన్నారు.

వదంతులే..

వదంతులే..

కానీ అనవసరంగా జల్లికట్టు ద్వారా జంతువులకు హాని కలిగిస్తున్నట్లు రకరకాల వదంతులు సృష్టిస్తున్నారని, ఇదంతా నిజం కాదన్నారు. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దులను ప్రాణంగా చూసుకుంటరారని, అది తాను కళ్లారా చూశానని పేర్కొన్నారు.

జంతు ప్రేమికుడినే..

జంతు ప్రేమికుడినే..

తాను కూడా జంతు ప్రేమికుడినేనని, రకరకాల జంతు సంక్షేమ సంస్థల తరఫున ప్రచారం చేశానని, ఓ జంతు ప్రేమికుడిగా చెప్తున్నానని, జల్లికట్టులో ఎద్దులకు హాని కలిగిస్తున్నారన్న విషయం అబద్దమని పేర్కొన్నారు.

జల్లికట్టులో లాఠీఛార్జ్

జల్లికట్టులో లాఠీఛార్జ్

జల్లికట్టు కారణంగా రాష్ట్రవాప్తంగా జరుగుతున్న నిరసనల్లో చాలామంది ప్రజలు లాఠీఛార్జ్‌లో గాయపడ్డారని, ఈ నిరసనలు ఇలాగే కొనసాగితే ముందుముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండవని భయంగా ఉందని, మీరు ప్రజల ప్రధాని అని, ఈ విషయంపై దృష్టి సారించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు కోరారు. సుప్రీం కోర్టు ఇచ్చే ఆర్డినెన్స్‌ కోసం లక్షల్లో ఎదురు చూస్తున్నారన్నారు.

నేను జంతు ప్రేమికుడినే..

నేను జంతు ప్రేమికుడినే..

కాగా, తాను కూడా జంతు ప్రేమికుడినే అని, జల్లికట్టు ద్వారా జంతువులకు హాని కలిగిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, రకరకాల జంతు సంక్షేమ సంస్థల తరఫున ప్రచారం చేశానని చెప్పడం ద్వారా త్రిషకు కౌంటర్ ఇచ్చినట్లయింది.

English summary
The Centre wants to catch the Jallikattu bull by the horns as BJP eyes a future in post-Jayalalithaa Tamil Nadu, but dissenting voices within led by Maneka Gandhi besides the law and environment ministries have got its hands tied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X