వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రావాళ్లు మొనగాళ్లు.. జల్లికట్టు నిరసనలో ఏపీపై తమిళుల ప్రశంస

'కోడి పందేలు నిర్వహించవద్దంటూ ఓవైపు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహించుకున్న ఆంధ్రా వాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే.. '

|
Google Oneindia TeluguNews

చెన్నై: మొత్తానికి పట్టిన పట్టు వీడకుండా తమిళ ప్రజలు తాము అనుకున్నది సాధించారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా తమిళ ప్రజానీకమంతా ఒక్క తాటిపైకి వచ్చి జల్లికట్టు కోసం నినదించడంతో.. కేంద్రం సైతం దిగిరాక తప్పకలేదు.

తమిళనాడు ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్ కు కొద్దిపాటి మార్పులు చేసి కేంద్రం దాన్ని న్యాయశాఖ ఆమోదం కోసం పంపించింది. దీంతొ తమ ఆకాంక్ష నెరవేరినందుకు తమిళ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

Jallikattu Protests praises Andhra people

మెరీనాబీచ్ వేదికగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్న సంగతి తెలిసిందే. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుందన్న విషయం తెలియగానే.. హర్షం వ్యక్తం చేసిన యువత.. అదే సమయంలో ఆంధ్రా ప్రాంత వాసుల స్పూర్తిని కొనియాడారు.

'కోడి పందేలు నిర్వహించవద్దంటూ ఓవైపు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహించుకున్న ఆంధ్రా వాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే.. అనుకున్న‌ట్టే కోడి పందేలు పూర్తి చేశారు. మేం మాత్రం ఇంకా జ‌ల్లిక‌ట్టు జ‌రుపుకోలేక‌పోతున్నాం' అంటూ నినాదాలు చేశారు.

English summary
Atlast Tamilnadu people are successed on Jallikattu. With their protest central responded possitively. At the same time Tamilnadu people praising Ap people for their support
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X