చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తగలబడిన చెన్నై, పోలీస్ స్టేషన్ కు నిప్పు, మాతో పెట్టుకుంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు నిర్వహణకు శాశ్వత చట్టం తీసుకురావాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఒక్క సారిగా రెచ్చిపోయారు.

<strong>జల్లికట్టు, ఇద్దరి మృతి, లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం</strong>జల్లికట్టు, ఇద్దరి మృతి, లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం

మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను సోమవారం ఉదయం పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నించారు. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద తమిళనాడు ప్రభుత్వం తమ ప్రతాపం చూపించడానికి ప్రయత్నించింది.

అందుకోసం పోలీసులను అక్కడికి పంపించడంతో పరిస్థితి ఒక్క సారిగామారిపోయింది. పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో విద్యార్థులు సహనం కోల్పోయారు. పోలీసులు, విద్యార్థుల మధ్య మాటల యుద్దం జరిగింది.

Jallikattu protests turn violent, Ice house police station set on fire by miscreants.

<strong>శశికళతో పన్నీర్ సెల్వం భేటీ: ఎం చెప్పారంటే ?</strong>శశికళతో పన్నీర్ సెల్వం భేటీ: ఎం చెప్పారంటే ?

ఆ సమయంలో పోలీసులు మళ్లీ లాఠీలకు పని చెప్పడంతో విద్యార్థులు రెచ్చిపోయారు. వేలాది మంది విద్యార్థులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ ముట్టడించి నిప్పంటించారు. సమీపంలో ఉన్న వాహనాలకు నిప్పటించడంతో జల్లికట్టు పోరాటం హింసాత్మకంగా మారిపోయింది.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపుచెయ్యడానికి ప్రయత్నించారు. అయితే వేలాది మంది విద్యార్థులను అదుపుచెయ్యడం పోలీసులకు సాధ్యంకాలేదు. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితి అదుపు చెయ్యడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

English summary
Tamil Nadu police since early morning started evicting protestors who were demonstrating their support for Jallikattu at the Marina Beach. Jallikattu protests turn violent, Ice house police station set on fire by miscreants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X