వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు, ఇద్దరి మృతి, లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం

తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలోని రావుసాల్ గ్రామంలో నిర్వహించిన జల్లికట్టు సాహస క్రీడలో రాజు (30), మోహన్ (30) అనే ఇద్దరు యువకులను ఎద్దులు పొడవడంతో ప్రాణాలు కోల్పోయారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో నిర్వహించిన జల్లికట్టు సాహస క్రీడలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పుదుకొట్టే జిల్లాలోని రాపూసాల్ గ్రామంలో ఆదివారం జల్లికట్టు క్రీడలు ప్రారంభం అయ్యాయి.

నేడు జల్లికట్టు, రేపు ఎండ్లబండ్లు, బుల్ బుల్ పిట్ట పోటీలు, శివసేన

తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ జల్లికట్టును ప్రారంభించారు. దాదాపు 150 ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. ఆ సమయంలో జల్లికట్టు సాహస క్రీడలో పాల్గొన్న రాజు (30), మోహన్ (30) అనే ఇద్దరు యువకులను ఎద్దులు పొడవడంతో తీవ్రగాయాలైనాయి.

Jallikattu: Tear gas used to disperse protesters at Madurai

ఇద్దరు యువకులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఇద్దరూ మరణించారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రీడల్లో 57 మందికి తీవ్రగాయాలైనాయి. జల్లికట్టు క్రీడలు ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ మైదానంలో ఉండగానే ప్రమాదం చోటు చేసుకోవడం విశేషం.

తమిళ తంబి దెబ్బ: థియేటర్లలో ఆ రెండు నో సేల్స్

జల్లికట్టు నిర్వహణకు శాశ్వత చట్టం చెయ్యాలని డిమాండ్ చేస్తూ సోమవారం మదురైలో విద్యార్థులు ఆందోళన చేశారు. వేల సంఖ్యలో విద్యార్థులు రోడ్ల మీదకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి చెయ్యిదాటి పోవడంతో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి విద్యార్థులను చెదరగొడుతున్నారు.

English summary
Tamil Nadu Jallikattu: Lathi charge Tear gas used to disperse protesters at Madurai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X