వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు ఉద్యమాన్ని మించి, హిందీ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతుంది : నటుడు కమలహాసన్

|
Google Oneindia TeluguNews

హిందీని దేశబాషగా ప్రవేశపెడితే జల్లికట్టు ఉద్యమం కంటే ఎక్కువగా పోరాడతామని నటుడు కమలహాసన్ కేంద్రాన్ని హెచ్చరించాడు. భారత్‌కు గాని తమిళనాడుకు గాని హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశాడు. గతంలో కూడ జాతీయ విద్యావిధానంపై మండిపడ్డ కమలహాసన్ దక్షిణాది రాష్ట్రాల పిల్లలు హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు.

 షా,సుల్తానులు ఎవరు ..?

షా,సుల్తానులు ఎవరు ..?

భారతదేశం సమాఖ్య దేశమని, ఇండియా ఏర్పడినప్పుడే బిన్నత్వంలో ఏకత్వం కల్గిఉందని, ఇప్పుడు షా,సుల్తానులు ఎవరని ఆయన ప్రశ్నించారు.దేశంలోని చాలా మంది బెంగాలీలో ఉన్న జాతీయ గీతాన్ని సంతోషంగా ఆలపిస్తున్నారని అన్నారు. అందుకు కారణం దాన్ని రాసిన కవి అన్ని భాషలకు, సంస్కృతులకు గౌరవం ఇచ్చాడు, అందుకే అది మన జాతీయ గీతంగా మారిందని అన్నారు. అయితే ఇలాంటీ బిన్న భాషలు గల కలుపుకొని ఉన్న భారతదేశాన్ని ప్రత్యేకమైనదిగా మార్చవద్దని ఆయన సూచించారు.

హిందీ జాతీయ భాషగా చేయలన్న అమిత్ షా

హిందీ జాతీయ భాషగా చేయలన్న అమిత్ షా


హిందీ భాషా దినోత్సవం సంధర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా ఒకే దేశం,ఒకే భాష అంటూ ఆయన ప్రకటన చేయడంతో హిందీని జాతీయ భాషగా చేయాలనే ఆలోచనను ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దేశం మొత్తానికి హిందీ బాష ఉండాలని, అదేవిధంగా మెజారీటీ ప్రజలు మాట్లాడే హిందీ భాష దేశం మొత్తాన్ని ఏకం చేస్తుందని ఆయన పేర్కోన్నాడు. ఇలా హిందీ భాషతోనే గాందీ, పటేళ్లు కళలు కన్న ఓకే స్వప్నాన్ని నిజం చేసేందుకు అందరు హిందీ మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

అమిత్ షా ప్రకటన తర్వాత ముఖ్యంగా దక్షినాదీ రాష్ట్రాల్లోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున విమర్శించారు.హిందీ జాతీయ బాష అంటూ అమిత్ షా అబద్దపు ప్రచారం చేస్తున్నారని పులువురు దుయ్యబట్టారు. ప్రాంతీయ బాషల వలే హిందీ కూడ ఒక బాష అంటూ మండిపడ్డారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలక రాష్ట్రంగా ఉన్న కేరళ సీఎం పినరయి విజయన్ సైతం అమిత్ షా ప్రకటనను వ్యతిరేకించారు. ఆయన చేసిన ప్రకటన మరో బాషపరమైన యుద్దానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.

English summary
Unity in diversity is a promise we made when India became a republic. Now no Shah, Sultan or Samrat should renege on that promises.Actor-politician Kamal Haasan on against Amit Shah hindi comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X