చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్.. జేఎంబీ ఉగ్రవాది అసదుల్లా షేక్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

చెన్నై : జమాతే ఉల్ ముజాహీద్దిన్ బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ (జేఎంబీ)కు చెందిన ముష్కరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 2న కోల్‌కతా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జేఎంబీకి సహకారం అందిస్తున్న మహ్మద్ అబ్దుల్ ఖాసీం అదుపులోకి తీసుకున్నారు. అతనిని తమదైన శైలిలో విచారిస్తే .. దేశంలో నక్కి ఉన్న ఉగ్రవాదుల జాడను తెలిపారు. దీంతో వారు ఇవాళ ఉదయం చెన్నైలో సోదాలు నిర్వహించారు.

జేఎంబీకి చెందిన ఉగ్రవాది అసదుల్లా షేక్‌కు అరెస్ట్ చేసినట్టు ఎస్టీఎఫ్ వర్గాలు ధ్రువీకరించాయి. తమ అదుపులో ఉన్న ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో చెన్నైలో సోదాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. చెన్నైలో ఉన్న అసదుల్లా షేక్‌ను పకడ్బందీగా పట్టుకున్నట్టు వివరించారు. అతనిని అదుపులోకి తీసుకొని .. మిగతా వారి నుంచి ఆరాతీస్తామని చెప్తున్నారు.

Jamaat-ul-Mujahideen Bangladesh terrorist arrested from STF team, success

ఈ నెల 2న ఎస్టీఎఫ్ సిబ్బంది మహ్మద్ అబ్దుల్ ఖాసీం అలియాస్ ఖాసీంను (22) కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతను జేఎంబీకి సహకారం అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఘజ్నాబి బ్రిడ్జ్ వద్ద గల కనాల్ తూర్పు రహదారి వద్ద అరెస్ట్ చేసినట్టు ఎస్డీఎఫ్ పోలీసులు తెలిపారు. ఖాసీం స్వస్థలం బుర్ద్వాన్ జిల్లాలోని మంగల్‌కోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని దుర్మాట్ అని పోలీసులు తెలిపారు.

English summary
An militant was arrested from Tamil Nadu capital Chennai on Tuesday morning. The arrested terrorist is from the terrorist organization of Bangladesh. Since the arrest, there has been an atmosphere of chaos in the entire area. Police have surrounded the entire area. In fact, this morning a Jamaat-ul-Mujahideen Bangladesh (JMB) terrorist was arrested from Chennai. The name of the terrorist caught is Asadullah Sheikh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X