బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు మరో ఉగ్రవాది అరెస్టు, జమాతుల్ ముజాహుద్దిన్ బంగ్లాదేశ్, మునీర్ తో లింక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో మరో అనుమానిత ఉగ్రవాదిని గురువారం అరెస్టు చేశారు. ఇప్పటికే అరెస్టు అయిన జహీదుల్ ఇస్లాం అలియాస్ మునీర్ ఇస్లాం అలియాస్ మునీర్ ఇచ్చిన సమాచారంతో ఎన్ఐఏ అధికారులు, బెంగళూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు.

జహీదుల్ ఇస్లాం ఇచ్చిన సమాచారంతో గురువారం శివాజీనగర్ లోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఆదిల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిషేదిత జమాతుల్ ముజాహుద్దీన్ బాంగ్లాదేశ్ ( JMB)ఉగ్రవాద సంస్థతో ఆదిల్ కు సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

Jamatul Mujahiddin Bangladesh activicist arrested in Bengaluru

నాలుగు రోజుల క్రితం రామనగరలో మునీర్ ఇస్లాంను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మునీర్ ఇస్లాం ఇంటిలో కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు ఉన్న మ్యాప్ లు, ఒక ల్యాప్ టాప్ గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

మునీర్ ఇస్లాం మొదట మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకున్నాడని అధికారులు అనుమానించారు. అయితే విదేశీ ఉగ్రవాదులతో మునీర్ ఇస్లాంకు సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మునీర్ ఇస్లాంను అరెస్టు చేసిన తరువాత అతని భార్య, అన్న, వదిన మాయం అయ్యారు. మునీర్ ఇస్లాం భార్య దగ్గర మరో ల్యాప్ టాప్ ఉందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే నాలుగు రోజుల నుంచి గాలిస్తున్నా మునీర్ ఇస్లాం భార్య, పిల్లలు, అన్న, వదిన ఆచూకి చిక్కలేదు. ఎలాగైనా వారిని పట్టుకోవాలని అధికారులు, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Bengaluru police have arrested one more Jamatul Mujahiddin Bangladesh (JMB) activicist near cantonment railway station on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X