వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీని తాకిన పౌరసత్వ నిరసనలు.. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు...

|
Google Oneindia TeluguNews

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక వివాదస్పద బిల్లు ప్రకంపనలు ఢిల్లీని సైతం తాకాయి. బిల్లును వ్యతిరేకిస్తూ...ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడుకుతుండగా..తాజాగా శుక్రవారం సాయంత్రం అవి ఢిల్లీలో కూడ మొదలయ్యాయి. వివాదస్పద బిల్లును వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటి విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో అది హింస్మాత్మకంగా మారింది.

 ఢిల్లీలో అందోళన

ఢిల్లీలో అందోళన

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ.. యూనివర్శిటి విద్యార్థులు క్యాంపస్ నుండి పార్లమెంట్ వరకు ర్యాలీ తీస్తూ.. నిరసన చేపట్టేందుకు పిలుపునిచ్చారు. దీంతో విద్యార్థులను క్యాంపస్ బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకోంది. దీంతో సంఘటన స్థలంలోనే 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతవరణం నెలకోంది.

విద్యార్థులపై టియర్ గ్యాస్ షెల్స్

విద్యార్థులపై టియర్ గ్యాస్ షెల్స్

నిరసన తెలుపుతున్న విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలోనే వారిని చెదరగొట్టెందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. అయితే శాంతీయుతంగా నిరసన తెలుపుతున్న అడ్డుకోని తమపై పోలీసులు బలప్రయోగం చేశారని విద్యార్థులు అరోపణలు చేశారు. కాగా అసోంలో నాలుగో రోజు కూడ నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రజలు రోడ్లపైకి వచ్చి అందోళన నిర్వహించారు.

బెంగాల్ రైల్వే స్టేషన్‌కు నిప్పు

బెంగాల్ రైల్వే స్టేషన్‌కు నిప్పు

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కూడ ఈ నిరసనలు చెలరేగాయి. దీంతో బెంగాల్‌ని ముర్షిదాబాద్ రైల్వే స్టేషన్‌కు నిరసన కారులు నిప్పు పెట్టారు. బెల్దంగా రైల్వే కాంప్లెక్స్ లోకి దూసుకు వెళ్లి అక్కడ ఉన్న రైల్వే పోలీసులపై దాడులు చేశారు. బెంగాల్‌లోని పలుజిల్లాలో కూడ ఇదే పరిస్థితి నెలకొంది. కోల్‌కతా నగరంలో కూడ సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ మొత్తం నిలిపివేసిన పరిస్థితి కనిపించింది. నిరసలతో ద పలు రైళ్ల సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించగా విమాన సర్వీసులు కూడ రద్దు చేశారు..

English summary
Jamia Millia Islamia University clashed with police in Delhi today, after students were prevented from taking out a protest march to the Parliament House against the amended Citizenship
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X