బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో ఉగ్రదాడులకు జేఎంబీ స్కెచ్, గ్రెనేడ్లు, పిస్తోల్, గన్ సీజ్, ఆనలుగురు, ఎన్ఐఏ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన జమాత్ ఉల్ ముజాహుద్దీన్ (జేఎంబీ) అనుమానిత ఉగ్రవాది నజీర్ షేక్ అలియాస్ పాట్లా అసన్ తన అనుచరులతో కలిసి బెంగళూరులో విధ్వంసాలు సృష్టించడానికి ప్లాన్ వేశాడని విచారణలో అంగీకరించాడు. ఎన్ఐఏ అధికారులు నజీర్ షేక్ ను విచారణ చేసి గ్రెనేడ్లు, పిస్తోల్, గన్ సీజ్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్రవాదులు బెంగళూరులో ఎక్కడెక్కడ దాడులు చెయ్యడానికి ప్రయత్నాలు చేశారు అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.

బెంగళూరులో ట్రాఫిక్ జాం రిపోర్టు, మీ కర్మ కాలిపోతుంది, హైదరాబాద్ లో గంటకు కి.మీ !

త్రిపురాలో మకాం

త్రిపురాలో మకాం

త్రిపురా రాజధాని అగర్తలాలో జమాత్ ఉల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది నజీర్ షేక్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని చిక్కబాణవారలోని నజీర్ షేక్ ఇంటిలో ఉగ్రదాడులకు సంబంధించిన ఆధారాలను అధికారులు గుర్తించారు.

ఆనలుగురు !

ఆనలుగురు !

నజీర్ షేక్ పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ నివాసి. నజీర్ షేక్, జహీదుల్ ఇస్లాం, నస్రుల్ ఇస్లాం, ఆసిఫ్ ఇక్బాల్ తదితరులు కలిసి బెంగళూరులోనే నివాసం ఉన్నారు. తరువాత బెంగళూరులో విధ్వంసాలు సృష్టించడానికి ప్లాన్ వేశారని అధికారుల విచారణలో నజీర్ షేక్ అంగీకరించాడు.

 బెంగళూరు శివార్లలో ఇల్లు

బెంగళూరు శివార్లలో ఇల్లు

బెంగళూరు నగర శివార్లలో అద్దె ఇంటిని తీసుకున్న నజీర్ షేక్ అక్కడే పేలుడు పదార్థాలు తయారు చేశాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. నజీర్ షేక్ తయారు చేసిన పేలుడు పదార్థాలను బెంగళూరులో విధ్వంసాలు సృష్టించడానికి ఉపయోగించాలని ఉగ్రవాదులు ప్లాన్ వేశారని సమాచారం.

గ్రెనేడ్లు, పిస్తోల్, గన్ సీజ్ !

గ్రెనేడ్లు, పిస్తోల్, గన్ సీజ్ !

నజీర్ షేక్ ఇచ్చిన సమాచారం మేరకు దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు, 9 ఎంఎం పిస్తోల్, ఎయిర్ గన్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని చిక్కబాణవార సమీపంలోని ఇంటిలో ఎన్ఐఏ అధికారులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

 2018లో బెంగళూరులో !

2018లో బెంగళూరులో !

జమాత్ ఉల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థకు భారత్ లో నజీర్ షేక్ పని చేస్తున్నాడు. నజీర్ షేక్ ఉగ్రవాద సంస్థలో చురుకుగా పని చేస్తున్నాడు. 2018లో బెంగళూరు వచ్చిన నజీర్ షేక్ అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది. నజీర్ షేక్ ను ఎన్ఐఏ అధికారులు విచారణ చేసి మరింత వివరాలు బయటకు లాగుతున్నారు. బెంగళూరులో ఎక్కడెక్కడ ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి స్కెచ్ వేశారు అని అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
The investigations being conducted by NIA revealed that Jammat-ul-Mujahideen planned for carrying major disruptive activities at Bengaluru. This was revealed following the arrest of Najir Sheikh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X