వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ లో 30x40 ఇంటి స్థలాలు ‘ఫర్ సేల్’:ఉడిపి, మురగన్ హోటల్స్, పంజాబి ఢాబాలు !

|
Google Oneindia TeluguNews

కాశ్మీర్: కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చెయ్యడంతో సోషల్ మీడియాలో ఆ విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది. కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాశ్మీర్ లో సైట్ ఫర్ సేల్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.

కాశ్మీర్ లో ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే కొందరికి సోమవారం నాగుల పంచమి పండుగ సందర్బంగా పంచ్ పడిందని కామెంట్ చేస్తున్నారు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖా మంత్రి అయిత్ షా ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో వాయువేగంతో ఆ వార్త హల్ చల్ చేసింది.

 Jammu and Kashmir article 370 scapped memes spreading in social media

కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా కొందరు, వ్యతిరేకిస్తూ కొందరు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. గత మూడు వారాల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల విషయంలో జోరుగా చర్చకు దారితీసింది. ఇప్పుడు కాశ్మీర్ విషయం తెర మీదకు వచ్చింది.

జమ్మూ కాశ్మీర్ లో ఇంత కాలం స్థానికంగా నివాసం ఉంటున్న వారే ఇంటి స్థలాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు కావడంతో కాశ్మీర్ లో 30x40 ఇంటి స్థలాలు విక్రయించడానికి, కొనుగోలు చెయ్యడానికి అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ లో ఉడిపి హోటల్, మురుగన్ హోటల్, వెన్నదోసె హోటల్, పంజాబీ ఢాబా, ధారవాడ ఠకూర్ పేడా షాప్ లు పెట్టడానికి అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో మీమ్స్ తో కామెంట్లు పెడుతున్నారు. జులై 22 సోమవారం చంద్రయాన్ -2, జులై 29 సోమవారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆగస్టు 5వ తేదీ సోమవారం ఆర్టికల్ 370 రద్దు, ఆగస్టు 12 సోమవారం ఏం జరుగుతోంది ? జై సోమనాథ్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి కామెంట్లు పెట్టడంతో వైరల్ అయ్యాయి.

English summary
Announcement of scrapping Article 370 in Jammu And Kashmir. Memes, Discussions Spreading Out In Social Media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X