వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్..! అత్యంత సాహోసోపేత అడుగులు వేసిన బీజేపి..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న బీజేపి || J&K As Union Territory BJP Dashing Steps In Politics

ఢిల్లీ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో బీజేపి సాహసోపేతంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన బిల్లును నేడు రాజ్యసభ్యలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రతిపాదించారు. ఉదయం 11 గంటలకు మొదలైన రాజ్యసభ సెషన్‌లో ఆయన జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్ల సవరణ బిల్లుతోపాటు ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారానే ఈ బిల్లు రద్దు జరుగుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ బిల్లులో భాగంగా జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది. ఇక అసెంబ్లీతో కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకాశ్మీర్ మారనుండగా, అసెంబ్లీ లేకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా లదాఖ్ మారనుంది.

ఆర్టికల్ 370పై శ్యామ ప్రసాద్ ముఖర్జీ కల సాకారం.. ఆయన ఏమి కోరుకున్నారు... బీజేపీ ఏమి చేసింది.. !! ఆర్టికల్ 370పై శ్యామ ప్రసాద్ ముఖర్జీ కల సాకారం.. ఆయన ఏమి కోరుకున్నారు... బీజేపీ ఏమి చేసింది.. !!

కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకాశ్మీర్..! దేశ రాజకీయాల్లో సంచలన సంఘటన..!!

కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకాశ్మీర్..! దేశ రాజకీయాల్లో సంచలన సంఘటన..!!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్టికల్ 370, 35A రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాద ప్రకటన చేశారు. సభ్యుల ప్రతిఘటనల మధ్య బిల్లును అమిత్ షా ప్రతిపాదించారు. కశ్మీర్‌కు సంబంధించిన ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా తేల్చిచెప్పారు. అయితే అమిత్ షా బిల్లును ప్రతిపాదిస్తున్న సమయంలో విపక్షాలు అడ్డుతగిలాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాలు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.

ఇక 28 రాష్ట్రాలతో భారతదేశం..! ఆర్టికల్ 370 రద్దుకు షా ప్రతిపాదన..!!

ఇక 28 రాష్ట్రాలతో భారతదేశం..! ఆర్టికల్ 370 రద్దుకు షా ప్రతిపాదన..!!

మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో జమ్మూకశ్మీర్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాద ప్రకటన చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్ ఆర్టికల్‌ 370 రద్దుతో కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది. జమ్మూకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లదాఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తున్నట్లు అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. ఇక కేంద్రం ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంతో కలిపి 29 రాష్ట్రాలను కలిగిన భారత దేశం ఇక నుంచి జమ్మూకశ్మీర్ ను కేంద్రం పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో 28 రాష్ట్రాలనే కలిగి యుండనుంది.

ఆర్టికల్‌ 35ఏ ఇచ్చిన అధికారాలు..! ఇక ప్రత్యేక హక్కులు..!!

ఆర్టికల్‌ 35ఏ ఇచ్చిన అధికారాలు..! ఇక ప్రత్యేక హక్కులు..!!

ఈ అధికరణ ప్రకారం జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలుకు, స్థిర నివాసానికి, రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పథకాలకు వారు మాత్రమే అర్హులు. కంపెనీలు రాష్ర్టేతర వ్యక్తులను నియమించుకోవడంపై ఈ అధికరణ నియంత్రణ విధిస్తోంది. ఒక వేళ రాష్ట్రేతర వ్యక్తిని వివాహం చేసుకున్న జమ్మూకశ్మీర్‌ మహిళలు ఆస్తి హక్కులను కోల్పోతారు.

ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్య..! పరిష్కారం దిశగా బీజేపి సర్కార్..!!

ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్య..! పరిష్కారం దిశగా బీజేపి సర్కార్..!!

కాగా, అధికరణ 370ని రాష్ట్రపతి ఉత్తర్వుతో తొలగించేందుకు 370(3) అధికరణ అనుమతినిస్తున్నది. అయితే ముందుగా జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగ సభ సమ్మతి పొందాల్సి ఉంటుంది. 1957 జనవరి 26న ఆ సభను రద్దు చేసిన నేపథ్యంలో అధికరణను తొలగించడానికి వీలుండదని ఒక వాదన. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ సమ్మతితో తొలగించవచ్చన్న మరో వాదన కూడా ఉంది.

English summary
BJP seems to be a bold step in the politics of the country. The bill for the cancellation of Article 370 in Jammu and Kashmir has been proposed by Union Home Minister Amit Shah in the Rajya Sabha today. In the Rajya Sabha session, which began at 11 am in the morning, he announced that he would cancel article 370 along with the Jammu and Kashmir reservation Amendment bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X