వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్‌లో కోలాహలం: ఒకేసారి 24 దేశాల ప్రతినిధులు రాకకు కారణం?

|
Google Oneindia TeluguNews

జమ్మూ: కేంద్ర పాలిత ప్రాంతంగా రూపాంతరం చెందిన భూతలస్వర్గం జమ్మూ కాశ్మీర్‌లో కోలాహలం నెలకొంది. ఒకేసారి 24 దేశాలకు చెందిన ప్రతినిధులు, రాయబారులు, దౌత్యాధికారులు అక్కడ పర్యటిస్తోన్నారు. స్థానికులను కలుసుకొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా బదలాయించిన తరువాత.. వేర్వేరు దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యాధికారులు అక్కడ పర్యటిస్తుండటం ఇది రెండోసారి. రెండురోజుల పాటు జమ్మూ కాశ్మీర్‌లో వారు పర్యటిస్తారు.

నిమ్మగడ్డ మార్క్ ఫైర్: మున్సిపల్ ఎన్నికలకు ముందే: గ్రేటర్ విశాఖ కమిషనర్‌పై బదిలీ వేటునిమ్మగడ్డ మార్క్ ఫైర్: మున్సిపల్ ఎన్నికలకు ముందే: గ్రేటర్ విశాఖ కమిషనర్‌పై బదిలీ వేటు

చిలి, బ్రెజిల్, క్యూబా, బొలీవియా, ఈస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, యూరోపియన్ యూనియన్, బెల్జియం, స్పెయిన్, స్వీడన్, ఇటలీ, బంగ్లాదేశ్, మలావీ, ఎరిట్రియా, కోట్ డీ ఐవరీ, ఘన, సెనెగల్, మలేసియా, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్ దేశాల ప్రతినిధులు ఈ ఉదయం శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి కాశ్మీరీ మహిళలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం వారంతా బుడ్గామ్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు.

Jammu and Kashmir: Foreign envoys from 24 nations interact with locals in Budgam

ఈ జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మాగమ్ బ్లాక్ పరిధిలో స్థానికులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. 2019లో అక్టోబర్‌లో 27 దేశాలకు చెందిన ఎంపీలు జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత దీన్ని కొనసాగించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో దీన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. తాజాగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది.

పెద్ద సంఖ్యలో విదేశీ ప్రతినిధుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతా చర్యలను తీసుకుంది. వారు పర్యటించే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రెండు రోజులకు ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో ముందస్తు గాలింపు చర్యలను సైతం చేపట్టింది. ఎక్కడ? ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. విదేశీ ప్రతినిధుల ఒక్కరోజు పర్యటనకు ముందే- టిప్పర్‌లో ఐఈడీ పేల్చివేత ఘటన చోటు చేసుకోవడంతో భద్రతను మరింత బలోపేతం చేసింది.

English summary
Jammu and Kashmir: Foreign envoys who are visiting the union territory, interact with locals in Magam block of Budgam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X