వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో హై అలర్ట్.. పుల్వామా తరహా దాడులు మరోసారి... యూఎస్, భారత ఇంటలిజెన్స్ హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

జమ్ము, కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి జరగవచ్చని భారత తోపాటు ఆమేరికా ఇంటలీజన్స్ వ్యవస్థలు హెచ్చరించాయి. దీంతోపాటు పాకిస్థాన్ గుఢాచార సంస్థలు కూడ ఆదేశానికి విషయాన్ని తెలియ చేశాయని చెప్పారు. దీంతో కశ్మీర్‌లోని పుల్వామా మరియు అవంతిపోర జిల్లాల్లో ఈ దాడులు జరగవచ్చని ఇంటలీజన్స్ వర్గాలు హెచ్చారించాయి. ఈనేపథ్యంలోనే భద్రతా దళాలు కశ్మీర్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించాయి.. రాష్ట్ర్రంలో సెక్యూరిటీ ఎజన్సీస్ అన్నింటిని అప్రమత్తం చేశాయి.

జకీర్ మూస ఎన్‌కౌంటర్‌కు ప్రతికార దాడులు

జకీర్ మూస ఎన్‌కౌంటర్‌కు ప్రతికార దాడులు

కశ్మీర్‌లోని ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాది జకీర్ మూస మ‌ృతికి నిరసనగా ప్రతికారదాడులకు తీర్చుకునేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్దంగా ఉన్నాయనే సమాచారం మేరకు మరోసారి కశ్మీర్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ తీవ్రవాదీ బుర్హాన్ వాణి ప్రధాన అనుచరుడు జకీర్ మూస మే 24న జరిగిన భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మ‌ృత్యువాత పడ్డాడు. దీంతో ఆ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మరోసారి ఉగ్రవాదులు పుల్వామా, మరియు అవంతిపోర జిల్లాలో గతంలో పుల్వామాలో జరిగిన వెహికిల్ ఐఈడీ దాడులు జరగవచ్చని ఇంటలీజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

దాడులు జరుగుతాయంటూ పాకిస్థాన్ సైతం హెచ్చరికలు

దాడులు జరుగుతాయంటూ పాకిస్థాన్ సైతం హెచ్చరికలు

మరోవైపు పాకిస్థాన్ సైతం ఈ సమాచారాన్ని ఇండియాకు చేరవేసినట్టు ఇంటలీజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పాకిస్తాన్, ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నడంతో అంతర్జాతీయ సమాజంలో సైతం పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నారనే అపవాదు ఎదుర్కోంటుంది. నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా పాకిస్థాన్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు చెబుతున్నారు.ఈనేపథ్యంలోనే భారత భద్రతా దళాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి.

పుల్వామా దాడి తర్వాత మొదటి హెచ్చరికలు

పుల్వామా దాడి తర్వాత మొదటి హెచ్చరికలు

కాగా ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో 40 మంది జవానులు మ‌ృత్యువాత పడిన తర్వాత ఇలాంటీ హెచ్చరికలు రావడం ఇదే మొదటిసారి,మరోవైపు కాగా అనంత్‌నాగ్ జిల్లాలోని కేపి రోడ్డులో ఇద్దరు మిలిటెంట్ల దాడిలో సిఆర్‌ఫిఎఫ్ జవానుల జీపుపై ఎదురుగా వచ్చి కాల్పులు జరిపారు. మరోవైపు భద్రతా దళాలు అనంత్‌నాగ్ జిల్లాలోనే జరిగి మరో ఎన్‌కౌంటర్‌లో తీవ్రవాదని ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. పోలీసులు జాతీయ రహాదారులతోపాటు ఇతర ప్రాంతాల్లో క్షణ్ణంగా తనిఖీలు జరుపుతున్నారు.

English summary
Jammu and Kashmir has been put on high alert after Pakistan reportedly shared with India Intel inputs on a possible terror attack in Awantipora, Pulwama district. The Intel warnings, which were shared before the SCO summit in Bishkek, have also been shared with the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X