వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకశ్మీర్ : నిర్బంధంలో ఉన్న ఐదుగురు నేతల విడుదల..

|
Google Oneindia TeluguNews

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పలువురు స్థానిక రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్.. శ్రీనగర్ ఎమ్మెల్యే హాస్టల్లో నిర్బంధంలో ఉన్న ఐదుగురు రాజకీయ నేతలను విడుదల చేసింది. విడుదలైనవారిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత సల్మాన్ సాగర్, మాజీ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే అల్తాఫ్ కలూ,మాజీ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్సీ షౌకత్ గనై,మరో నేషనల్ కాన్ఫరెన్స్ ముక్తార్‌తో పాటు పీపుల్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత నిజామ్ ఉ దిన్ బత్ ఉన్నారు. దాదాపు మరో 20 మంది రాజకీయ నేతలు ఇంకా శ్రీనగర్ ఎమ్మెల్యే హాస్టల్లో నిర్బంధంలోనే ఉన్నారు. ఇందులో పీడీపీ నేత నయిం అక్తర్,నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలు అలీ మహమ్మద్ సాగర్,జమ్మూకశ్మీర్ పీపుల్ మూవ్‌మెంట్ చీఫ్ షా ఫెజల్‌ ఉన్నారు. కాగా,జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మాజీ సీఎంలు మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను కూడా గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. హజ్రత్‌బల్ ప్రాంతంలో రెండు గ్రెనేడ్ పేలుళ్లకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కుట్ర చేసినట్టు గుర్తించారు. కుట్రను విచ్ఛిన్నం చేసిన పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్దమవుతున్నవేళ.. పేలుళ్లతో అలజడి రేపాలని ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు గుర్తించారు.
అరెస్టయిన ఉగ్రవాదులను సదర్బల్ హజ్రత్‌బల్‌కి చెందిన అహ్మద్ షేక్,అసార్ కాలనీకి చెందిన ఉమర్ హమీద్ షేక్,అసార్ కాలనీ హజ్రత్‌బల్‌కి చెందిన ఇంతియాజ్ అహ్మద్,ఇలాహిబాగ్‌కి చెందిన సాహిల్ ఫరూఖ్ గోజ్రి,సదర్బల్ హజ్రత్‌బల్‌కి చెందిన నజీర్ అహ్మద్‌లుగా గుర్తించినట్టు పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ఐఈడీతో పాటు 140 గిలెటిన్‌ స్టిక్స్‌, 40 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైషే ఉగ్రకుట్రను భగ్నం చేయడం కశ్మీర్ పోలీసుల విజయం అని డీజీపీ దిల్బగ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

 jammu kashmir administration released five more poiticians from sub jail of srinagar mla hostel

కశ్మీర్ వ్యాలీలో ఇటీవల చోటు చేసుకున్న రెండు పేలుళ్ల ఘటనలపై విచారణ జరుపుతున్న క్రమంలో తాజా ఉగ్రకుట్రను భగ్నం చేసినట్టు శ్రీనగర్ పోలీసులు తెలిపారు. ఆర్టిఫీషియల్&హ్యూమన్ ఇంటలిజెన్స్ నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు పలు రహస్య స్థావరాలతో పాటు పలు ఇళ్లపై దాడులు చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ షేక్,ఉమర్ హమీద్ షేక్ అనే ఇద్దరు అనుమానిత జైషే ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ నెల 8న హబ్బక్ క్రాసింగ్ వద్ద జరిగిన పేలుడుతో పాటు నవంబర్ 28న కశ్మీర్ యూనివర్సిటీ వద్ద జరిగిన గ్రెనేడ్ పేలుళ్లలో తమ పాత్ర ఉన్నట్టు విచారణలో పోలీసులకు వెల్లడించారు.
అహ్మద్ షేక్,ఉమర్ హమీద్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇంతియాజ్ అహ్మద్,సాహిల్ ఫరూఖ్,నజీర్ అహ్మద్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని విచారించగా జనవరి 26న దాడులకు ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు ఓ ఇంటిపై దాడి చేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో.. ఉగ్రకుట్ర ద్వారా అలజడి రేపేందుకు కుట్ర చేశారని పోలీసులు తెలిపారు. IED దాడులకు ప్లాన్ వేసినట్టు గుర్తించామన్నారు. విచారణలో వెల్లడయ్యే సమాచారం ఆధారంగా మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.

English summary
the J&K administration on January 16 released five more politicians from the sub-jail of MLA Hostel in Srinagar.Those released included National Conference (NC) leader Salman Sagar, ex-NC MLA Altaf Kaloo, ex-NC MLC Showkat Ganai, NC leader Mukhtar Band and People Democratic Party (PDP) leader Nizam u Din Bhat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X